News March 11, 2025
VZM: ఇంటర్ పరీక్షకు 1,012 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు ఫిజిక్స్, ఎకనామిక్స్, ఒకేషనల్ విద్యార్థులు 1,012 మంది గైర్హాజరు అయ్యారని ఆర్‌ఐఓ ఎం.ఆదినారాయణ తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 22,398 మంది హాజరు కావాల్సి ఉండగా వారిలో 21,386 మంది మాత్రమే హాజరయ్యారని అన్నారు. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడకుండా పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.
Similar News
News March 20, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో బేబినాయన భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన గురువారం భేటీ అయ్యారు. అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను విన్నవించారు. బాడంగి మండలం గొల్లాదిలో వేగవతి నదిపై వంతెన ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పామని వంతెన నిర్మాణానికి సహకరించాలని కోరారు. వంతెన నిర్మాణం పూర్తయితే నిర్మాణం వలన బాడంగి, రాజాం, దత్తిరాజేరు, మెరకముడిదాం గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.
News March 20, 2025
విజయనగరం జిల్లా వాసులకు అలెర్ట్

విజయనగరం జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. 15 మండలాల్లో సుమారు 40 °C టెంపరేచర్ నమోదు కానుండగా.. 20 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. వంగరలో 40.6°C, తెర్లాంలో 40.5°C, రామభద్రపుర, రేగిడి ఆమదాల వలసలో 40.2, మెరకముడిదాంలో 40, గజపతినగరం, రాజాంలో 39.9, గంట్యాడలో 39.7, సంతకవిటిలో 39.6, గరవిడిలో 39.5, గుర్లలో 39.3, విజయనగరంలో 38.5°C గా నమోదవుతాయి.
News March 20, 2025
VZM: నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి: SP

సైబరు నేరాలను చేధించేందుకు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లగా పని చేస్తున్న కానిస్టేబుళ్లకు బుధవారం అవగాహన కల్పించారు. రాబోయే రోజుల్లో సైబరు నేరాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నేరాలను నియంత్రించుట, నమోదైన కేసుల్లో దర్యాప్తు చేపట్టుటకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతీ పోలీసు అధికారి మెరుగుపర్చుకోవాలన్నారు.