News March 4, 2025

VZM: ఇంటర్ పరీక్షకు 922 మంది గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ పరీక్షను 22,114 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 21,192 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్‌స్పెక్టర్ మజ్జి ఆదినారాయణ తెలిపారు. మొత్తం 922 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 90 మంది ఇన్విజిలేటర్లు, 6 సిట్టింగ్ స్క్వాడ్‌లు, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు నియమించారు. జిల్లాలో ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆయన చెప్పారు.

Similar News

News March 19, 2025

VZM: 23న జ‌రిగే అక్ష‌రాస్య‌తా ప‌రీక్ష‌కు ఏర్పాట్లు

image

ఈ నెల 23వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వ‌హించే ప్రాథమిక అక్ష‌రాస్య‌తా ప‌రీక్ష‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని DRDA PD ఎ.క‌ల్యాణ‌చ‌క్ర‌వ‌ర్తి, వ‌యోజ‌న విద్య DD ఎ.సోమేశ్వ‌ర్రావు కోరారు. స్థానిక DRDA స‌మావేశ మందిరంలో వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మ‌న్వ‌య స‌మావేశాన్ని మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు. ఉద‌యం 10 నుంచి సాయంత్రం 5 గంట‌లు మ‌ధ్య ల‌బ్దిదారులు వారికి వీలైన స‌మ‌యంలో పరీక్ష నిర్వహిస్తామన్నారు.

News March 18, 2025

భోగాపురంలో బాంబు పేలి కార్మికుడి మృతి

image

భోగాపురంలో రాళ్లను పేల్చేందుకు ఏర్పాటు చేసిన బాంబు పేలి కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం సోమవారం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల్లో భాగంగా రహదారి ఏర్పాటుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించే క్రమంలో బాంబులు పెడుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రామచంద్రపేటకు చెందిన కార్మికుడు కొత్తయ్య మృతి చెందాడు.

error: Content is protected !!