News March 2, 2025
VZM: ఇంటర్ పరీక్షలకు 702 మంది విద్యార్థులు గైర్హాజరు

విజయనగరం జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 702 మంది గైర్హాజరైనట్లు ఆర్ఐఓ ఆదినారాయణ చెప్పారు. జిల్లావ్యాప్తంగా 166 పరీక్షా కేంద్రాలలో 508 మంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు, 194మంది ఓకేషనల్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. కొంతమంది విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో హాజరు కాకపోవడంతో గైర్హాజరు కాగా మరికొంతమంది వివిధ కారణాలతో హాజరు కాలేదు.
Similar News
News March 3, 2025
హత్యాచారయత్నం ఘటనలో నిందితుడికి పదేళ్ల జైలు: SP

బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో 2020లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో నిందితుడు తవిటయ్యకు పదేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. చంద్రంపేటకు చెందిన తవిటయ్య అదనపు కట్నం తేవాలని వేధిస్తుండేవాడని, ఈ క్రమంలో కన్నవారి ఇంటి వద్ద ఉన్న భార్య, ఇతర కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా పాకకు నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడడంతో అప్పట్లో కేసు నమోదైందన్నారు.
News March 3, 2025
MLC కౌంటింగ్.. ఎలిమినేట్ అవుతున్న అభ్యర్థులు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థులు ఎలిమినేట్ అవుతున్నారు. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదుగురు అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఇంకా ఐదుగురు అభ్యర్థులు మిగిలి ఉన్నారు. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులలో పి.శివ ప్రసాద్, ఎస్‌ఎస్.పద్మావతి, డాక్టర్ కే.రాధాకృష్ణ, ఆర్.సత్యనారాయణ, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు ఉన్నారు. కాగా ‘గాదె’ ముందంజలో కొనసాగుతున్నారు.
News March 3, 2025
VZM: గెలుపు దిశగా గాదె.. దేనికి సంకేతం?

ఉపాధ్యాయ MLC ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడు గెలుపు దిశగా పయనిస్తున్నారు. మాజీ MLC రఘువర్మకు కూటమి మద్దతు పలికింది. ఆ దిశగా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజా ప్రతినిధులు రఘువర్మను గెలిపించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆయనను కాదని గాదెకే గురువులు పట్టం కట్టారనేది లెక్కింపులో స్పష్టమవుతుంది. సమస్యల పరిష్కారానికై ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారని పలువురు భావిస్తున్నారు.