News November 1, 2024
VZM: ఈనెల 10న డీఎస్సీ ఉచిత శిక్షణకు స్కీనింగ్ పరీక్ష
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నవంబర్ 3న జరగాల్సిన స్క్రీనింగ్ పరీక్షను నవంబర్ 10న నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ,గిరిజన సంక్షేమ శాఖ జిల్లా ఉప సంచాలకులు బి.రామనందం శుక్రవారం తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్ నమోదు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి ఎంపికైన వారికి 3 నెలల పాటు ఉచిత భోజన, వసతులు కల్పించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.
Similar News
News December 5, 2024
VZM: పండగ వాతావరణంలో మెగా పేరెంట్స్ డే
జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 7న మెగా పేరెంట్, టీచర్స్ సమావేశాలను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశాలు ప్రతీ ఒక్కరికీ ఒక మధుర స్మృతిలా మిగిలిపోవాలన్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని రగల్చాలని, వారిలో సృజనాత్మకతను వెలికి తీసి, ప్రతిభకు పట్టం కట్టాలన్నారు.
News December 4, 2024
ఊపిరి పీల్చుకున్న విజయనగరం..!
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అలాంటి ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విశాఖలో అక్కయ్యపాలెంతోపాటు పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. కాగా.. గత సెప్టెంబర్‌లో బొబ్బిలి, పాచిపెంట, మక్కువ, సాలూరు తదితర ప్రాంతాల్లో భూమి కంపించగా..రిక్టర్ స్కేలు 3.4గా నమోదైంది.
News December 4, 2024
బొబ్బిలిలో రైలు ఢీకొని యువకుడి మృతి
బొబ్బిలి పట్టణంలో రైలు ఢీకొని ఓ యువకుడు మంగళవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన యువకుడు బాడంగి మండలం భీమవరం గ్రామానికి చెందిన కొండేటి చంద్రశేఖర్‌గా గుర్తించారు. అయితే ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఆత్మహత్య చేసుకున్నాడా.. అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైల్వే ఎస్ఐ బాలాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.