News April 3, 2025
VZM: ఈనెల 10 నుంచి ఉచిత కుట్టు శిక్షణ

విజయనగరం జిల్లాలోని షెడ్యూల్డు కులాలకు చెందిన అభ్యర్ధులకు ఈనెల 10వ తేదీ నుంచి నగరంలో ఉచిత కుట్టు శిక్షణ అందించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ గురువారం తెలిపారు. నాక్ ఆధ్వర్యంలో వీటీ అగ్రహారంలో నిర్వహిస్తున్న స్కిల్ హబ్‌లో ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. SC వర్గానికి చెందిన 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు, పురుషులు అర్హులని పేర్కొన్నారు.
Similar News
News February 26, 2026
చీపురుపల్లి నుంచి ప్రధానితో సీఎం వీసీ

ఈనెల 28న చీపురుపల్లి నుంచి సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్న 14-15 ఏళ్ల బాలికల ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొననున్నారు. CHC వద్ద ప్రత్యేక వేదిక, సాంకేతిక& వైద్య ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి బుధవారం ఆదేశించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
News February 26, 2026
VZM: నీట్ పరీక్షకు జిల్లాలో ఆరు కేంద్రాలు

మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో 6 కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్‌తో వీసీలో పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్, అయ్యప్పనగర్‌లో గల ఏ.పీ.మోడల్ స్కూల్, JNTU బ్లాక్ 1, 2 , ప్రభుత్వ బాలికల హైస్కూల్లలో నిర్వహిస్తామన్నారు. కేంద్రాల్లో 1800 మంది పరీక్ష రాసే సామర్థ్యం ఉందన్నారు.
News February 26, 2026
అక్షరాంధ్ర పరీక్షలకు శతశాతం హాజరు కావాలి: కలెక్టర్

ఈనెల 28న జరిగే అక్షరాంధ్ర ప్రీ-ఫైనల్ పరీక్షకు, మార్చి 15న నిర్వహించే ఫైనల్ పరీక్షకు నమోదు చేసుకున్న వారంతా తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని విజయనగరం కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులతో బుధవారం టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఇన్విజిలేటర్ల నియామకం, మూల్యాంకన ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు.


