News June 16, 2024
VZM: ఈ చలానాల రూపంలో రూ.48,015 జరిమానా

విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక ఎం.పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. మోటార్ వెహికల్ నిబంధనలను అతిక్రమించిన వారిపై మొత్తం రూ.48,015 ఈ చలనా రూపంలో విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపినవారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 8 కేసులు నమోదు చేయగా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై 21 కేసులు నమోదు చేశామన్నారు.
Similar News
News November 4, 2025
VZM: ఈ నెల 6న జడ్పీ సర్వ సభ్య సమావేశం

జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 6న ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరుగనుందని CEO సత్యనారాయణ మంగళవారం తెలిపారు. అక్టోబర్ 29న నిర్వహించాల్సిన సమావేశాన్ని తుఫాన్ కారణంగా వాయిదా వేశామన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నవంబర్ 6న సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
News November 4, 2025
పాత నేరస్థుల కదలికలపై నిఘానే కీలకం: VZM SP

జిల్లాలో నేరాలను అరికట్టడంలో పాత నేరస్థుల కదలికలపై నిఘానే కీలకమని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. హిస్టరీ షీటర్లు, పాత నేరస్థులపై ప్రత్యేక బృందాలు కట్టుదిట్టంగా నిఘా పెట్టాలని సూచించారు. రాత్రి గస్తీని ముమ్మరం చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి రవాణా, జూదాలు, కోడి పందాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
News November 4, 2025
రైల్వే స్టేషన్లలో సమస్యలపై ప్రస్తావించాం: VZM ఎంపీ

విజయనగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లలో వేచి ఉండే హాల్, మరుగుదొడ్లు, ఎస్కలేటర్లు, తదితర సదుపాయాలు కల్పించాలని ఎంపీ అప్పలనాయుడు కోరారు. విశాఖలో మంగళవారం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కి హాల్ట్, భువనేశ్వర్, తిరుపతి రైళ్లను ప్రతిరోజూ నడపడం, శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని కోరినట్లు ఎంపీ తెలిపారు.


