News January 12, 2025
VZM: ఈ నంబర్లకు కాల్ చేయండి: SP

సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఎక్కడైనా అల్లర్లు, ఆకతాయిల వేధింపులు, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే తమకు సమాచారం అందించాలని ఎస్పీ వకుల్ జిందాల్ కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 100, 112 ఫోన్ నంబర్లకు తక్షణమే సమాచారం అందించాలని, పోలీస్ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. ప్రజలందరూ ఆరోగ్యకరమైన వాతావరణంలో సంక్రాంతి జరుపుకోవాలని సూచించారు.
Similar News
News October 19, 2025
బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా పేల్చాలి: ఎస్పీ

విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రజలు బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా పేల్చాలని ఎస్పీ ఎఆర్ దామోదర్ కోరారు. దీపావళి సందర్బంగా ఆదివారం జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు నివారించాలని కోరారు. బాణాసంచాకు చిన్నపిల్లలను దూరంగా ఉంచాలి లేదా పెద్దల పర్యవేక్షణలో కాల్చాలని కోరారు. కాటన్ దుస్తులను ధరించి మతాబులు కాల్చాలన్నారు. మతాబులు కాల్చిన తర్వాత వ్యర్దాలు సురక్షితమైన ప్రదేశాలలో వేయాలన్నారు.
News October 19, 2025
VZM: నిబంధనలు పాటించని బాణాసంచా వ్యాపారులు

నగరంలోని బాణాసంచా షాపు యజమానులు అగ్నిమాపక నిబంధనలు పాటించడం లేదు. KL పురంలో అధికారికంగా 8 షాపులు ఉండగా, తాత్కాలిక అనుమతులతో మరో 15 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ మంటలు చెలరేగితే ఆర్పేలా సంబంధిత పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ 25వేల లీటర్ల నీటి సామర్ధ్యంతో ఒక సంపు, నిర్మించుకోవాలి. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాల్సిన అగ్నిమాపక అధికారులు అటు వైపు చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
News October 18, 2025
VZM: ‘బాల, బాలికలకు సమాన అవకాశాలు’

అన్ని రంగాల్లో బాల, బాలికలకు నేడు సమాన అవకాశాలు ఉన్నాయని జిల్లా వైద్యారోగ్య అధికారిణి జీవనరాణి అన్నారు. సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఘోషాసుపత్రిని శనివారం సందర్శించారు. రెండో సంతానంగా ఆడబిడ్డలు పుట్టిన బాలింతల వద్దకు వెళ్లి లింగ వివక్షతపై అవగాహన కల్పించారు. బాలికలను చక్కగా చదివించాలని, నేడు అన్ని రంగాల్లో మహిళలదే పైచేయి అని తెలిపారు. లింగ వివక్షత చూపిస్తే చర్యలు తప్పవన్నారు.