News January 3, 2025
VZM: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

విజయనగరంలోని NTR నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో గృహిణులు, యువతులకు వివిధ వృత్తి శిక్షణ కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ విమల తెలిపారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన వారు అర్హులన్నారు. కోర్సుని బట్టి 30 నుంచి 60 రోజుల శిక్షణ వ్యవధి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన మహిళలు, యువతులు జనవరి 10వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Similar News
News November 7, 2025
VZM: ‘మాతృ, శిశు మరణాలు జరగకుండ చర్యలు అవసరం’

జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఎస్. జీవనరాణి వైద్య సిబ్బందికి ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో సిబ్బందితో కమిటీ సమావేశం నిర్వహించారు. గత నెలలో జరిగిన 3 మాతృ మరణాలు, 6 శిశు మరణాలకు గల కారణాలను విశ్లేషించాలని సూచించారు. మాతృ, శిశు మరణాల సంభవించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
News November 7, 2025
VZM: ‘ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షానే ఉంటుంది’

తుఫాన్ హెచ్చరికలు వచ్చిన వెంటనే ముందస్తు చర్యలు తీసుకోవడంతో నష్టాన్ని తగ్గించగలిగామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షానే ఉంటుందని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. అధిక మోతాదులో యూరియా వినియోగించడం వల్ల మానవ ఆరోగ్యానికి ప్రమాదం కలుగుతుందన్నారు.
News November 6, 2025
మెంటాడ మార్పుపై ఎటువంటి ప్రతిపాదన చేయలేదు: మంత్రి

మెంటాడ మండలాన్ని మన్యం జిల్లాలో చేర్చాలనే అంశంపై తాను ఎటువంటి ప్రతిపాదన చేయలేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. జడ్పీ సమావేశంలో జడ్పీటీసీ సన్యాసినాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి ఆందోళనలో చేపడుతున్నారన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఇతర జిల్లాల నుంచి మాత్రమే ప్రతిపాదనలు వచ్చినట్లు పేర్కొన్నారు. అనవసర ఆందోళనలు వద్దని సూచించారు.


