News August 2, 2024

VZM: ఉద్యోగుల్లో స్థానికుల సంఖ్య‌పై స‌ర్వే

image

జిల్లాలోని పరిశ్రమలు, వివిధ కర్మాగారాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో స్థానికుల సంఖ్యపై వారం రోజుల్లో సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఉద్యోగాల్లో 75 శాతం స్థానికుల‌కే ఇవ్వాల‌న్న నిబంధ‌న ఎంత‌వ‌ర‌కు అమ‌లవుతుందో నిర్ధారించాల్సి ఉందన్నారు. ఆ నివేదిక‌ను దేశ‌ అత్యున్న‌త న్యాయ‌స్థానానికి అంద‌జేయాల్సి ఉన్నందున వారం రోజుల్లో స‌ర్వే పూర్తి చేయాల‌ని సూచించారు.

Similar News

News September 14, 2024

కేదార్‌నాథ్‌లో విజయనగరం వాసులు సేఫ్

image

కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న విజయనగరం వాసులకు గండం గట్టెక్కింది. వారిని ఒక్కొక్కరిగా అక్కడి నుంచి అధికారులు హెలికాఫ్టర్లో గుప్త కాశీకి తరలిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉద్యోగి కె.శ్రీనివాసరావు శనివారం ఉదయం హెలికాప్టర్‌లో క్షేమంగా గుప్త కాశీకి చేరుకోగా, మరో గంటలో మిగిలిన వారిని తరలించనున్నట్లు సమాచారం. మూడు రోజులుగా నలుగురు జిల్లా వాసులు కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

News September 14, 2024

విజయనగరం: యువకుడి హత్య.. నిందితుడు అరెస్ట్

image

గంట్యాడ మండలం మధుపాడలో తీవ్ర కలకలం రేపిన యువకుడి హత్య కేసులో నిందితుడు పాటూరి సాయిరామ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు DSP గోవిందరావు తెలిపారు. నిందితుడి చెల్లికి మృతుడు చల్లమనాయుడు(35) మధ్య ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిందితుడు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. సీఐ రామకృష్ణ, ఎస్సై సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News September 14, 2024

పైడితల్లి అమ్మవారి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

image

విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాల నిర్వహణపై శనివారం ఉదయం 11 గంగలకు కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం జరగనుంది. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అక్టోబర్ 15న అమ్మవారి సిరిమాను సంబరం జరగనున్న నేపథ్యంలో పండగ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్షించనున్నారు. జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు.