News January 11, 2025
VZM: ఉపాధి హామీ పనులకు రూ.23 కోట్ల బిల్లులు అప్లోడ్
జిల్లాలో మంజూరైన ఉపాధి హామీ పనులకు రూ.23 కోట్ల బిల్లులను అధికారులు ఇప్పటివరకు అప్లోడ్ చేశారు. రూ.45 కోట్ల విలువైన 866 పనులు జిల్లాలో ఇప్పటివరకు పూర్తి అయ్యాయి. కేవలం రూ. 23 కోట్ల బిల్లులను మాత్రమే అప్లోడ్ చేయడంతో పూర్తి అయిన పనులకు కూడా వెంటనే బిల్లులు అప్లోడ్ చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News January 11, 2025
జగన్‌ను అడ్డుకోవడం దారుణం: బొత్స
వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజులకు పెంచడమే తప్పు అన్నట్లు చంద్రబాబు మాట్లాడటం ఆయన చేతకానితనానికి నిదర్శనమని బొత్స మండిపడ్డారు. ‘గతంలో రెండు రోజులే వైకుంఠ దర్శనం ఉండేది. మా ప్రభుత్వంలో 10 రోజులకు పెంచాం. అప్పటి మా సీఎం జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. గాయపడిన వారిని పరామర్శించడానికి జగన్ వెళ్తే అడ్డుకోవడం ఏంటి. ఇంత కన్నా దారుణం ఎక్కడుంటుంది’ అని బొత్స ప్రశ్నించారు.
News January 11, 2025
విజయనగరం కలెక్టరేట్ గ్రీవెన్స్ డే రద్దు
విజయనగరం కలెక్టరేట్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే జరుగుతున్న విషయం తెలిసిందే. పండగ నేపథ్యంలో ఈనెల 13న(సోమవారం) జరగాల్సిన గ్రీవెన్స్ డేను రద్దు చేశామని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి ఆ రోజు ఎవరూ విజయనగరానికి రావద్దని సూచించారు.
News January 11, 2025
జిల్లాలో నేడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన
విజయనగరం జిల్లాలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం పర్యటించనున్నారు. జిల్లాలో ఉన్న ఓ యూనివర్శిటీలో డ్రోన్ల తయారీ యూనిట్‌ను శనివారం ఉదయం 11 గంటలకు రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నారు.