News December 20, 2024

VZM: ఉమ్మడి జిల్లాలో నేడు నలుగురు మంత్రుల పర్యటన

image

ఉమ్మడి జిల్లాలో శుక్రవారం నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, మంత్రి గుమ్మడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, NRI వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరంలో విజ్జీ స్టేడియాన్ని ప్రారంభిస్తారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Similar News

News December 12, 2025

VZM: జిల్లాలో ఎరువుల కొరత లేదు.. వ్యవసాయాధికారి

image

రబీ పంటల అవసరాలకు జిల్లాలో యూరియా నిల్వలు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని వ్యవసాయాధికారి రామారావు గురువారం తెలిపారు. ఇప్పటివరకు 8,058 మెట్రిక్ టన్నులు అందగా.. 5,110 టన్నులు రైతులకు విక్రయించారన్నారు. నెలాఖరుకి మరో 2,600 టన్నులు చేరనున్నాయని, ప్రస్తుతం 3,058 టన్నులు RSK, గోదాముల్లో ఉన్నాయన్నారు. ఎరువుల కొరత ఏదీ లేదని, ఎంఆర్పీకి మించి అమ్మితే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 12, 2025

15న పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినోత్సవం: VZM కలెక్టర్

image

ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినోత్సవం ఈనెల 15న విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరుకావాలని ఆదేశించారు.