News June 29, 2024

VZM: ఉమ్మడి జిల్లాలో 1863 కేసుల పరిష్కారం

image

రాజీయే రాజమార్గం అనే నినాదంతో ఉమ్మడి జిల్లాలో వివిధ కోర్టుల పరిధిలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 1863 కేసులకు పరిష్కారం లభించింది. విజయనగరం(1136), పార్వతీపురం(138), బొబ్బిలి(160), సాలూరు(151), ఎస్ కోట(65), గజపతినగరం(91), చీపురుపల్లి(50), కొత్తవలస(53), కురుపాం(19ల)లో కేసుల చొప్పున పరిష్కరించారు. ఈ ఒక్క రోజే సుమారు రూ.15 కోట్ల మొత్తాన్ని కక్షిదారులకు చెల్లించారు.

Similar News

News October 15, 2025

విజయనగరం జిల్లాలో 6,873 గృహ నిర్మాణాలు పూర్తి: కలెక్టర్

image

PMAY క్రింద మంజూరైన గృహాలను త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 8,259 గృహాలు లక్ష్యం కాగా 6,873 గృహాలు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన 1386 గృహాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ముందుగా అర్బన్‌లో సొంత స్థలాలు ఉన్న గృహాలను పూర్తి చేయాలన్నారు.

News October 15, 2025

బాణసంచా విక్రయాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ

image

దీపావళి సందర్భంగా బాణసంచా నిల్వలు, తయారీ, విక్రయాలకు సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తప్పనిసరి అని జిల్లా ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. తాత్కాలిక షాపులు పట్టణ శివార్లలోని బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణకు నీరు, ఇసుక తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News October 15, 2025

బాలికల సంక్షేమమే లక్ష్యం: DMHO

image

అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా విజయనగరం కేజీబీవీలో బాలికల ప్రాముఖ్యతపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. DMHO జీవన రాణి మాట్లాడుతూ.. బాలికల సంక్షేమానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. బాలికల కోసం ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయని వారి హక్కులకు భంగం కలిగితే చర్యలు తప్పవన్నారు. అనంతరం ర్యాలీ చేపట్టి లింగ వివక్షత ఉండరాదని నినాదాలు చేశారు.