News February 1, 2025
VZM: ఎన్నికల కోడ్ అమలుకు నోడల్ అధికారులు

జిల్లాలో ఉపాధ్యాయ MLC ఎన్నికల కోడ్ అమలకు నోడల్ అధికారుల నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి అంబేడ్కర్ ఉత్తర్వులు జారీ శనివారం చేశారు. MCC అమలుకు జిల్లా స్థాయి నోడల్ అధికారిగా ZP CEOసత్యనారాయణ నియమితులయ్యారు. ఆయన జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షిస్తారు. ఫిర్యాదులను స్వీకరించి చర్యలు చేపడతారు. ఎంపీడీవో, కమీషనర్ల ద్వారా మోడల్ కోడ్ అమలు చేస్తారు.
Similar News
News December 19, 2025
VZM: కలెక్టర్కు సీఎం చంద్రబాబు అభినందనలు

నైపుణ్య శిక్షణ, గృహనిర్మాణం, మున్సిపల్ సేవల్లో మెరుగైన పనితీరుతో విజయనగరం జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. IVRS సర్వేలో 69.14% సానుకూల స్పందన లభించింది. నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో రాష్ట్రంలో 3వ స్థానం, పీఎంఏవై గృహనిర్మాణంలో 4వ స్థానం సాధించింది. PGRSలో ఫిర్యాదులకు సానుకూల అభిప్రాయం వచ్చింది.
News December 19, 2025
విజయనగరం జిల్లాలో MSME కేంద్రానికి గ్రీన్ సిగ్నల్: మంత్రి

అనంతపురం, విజయనగరాల్లో 2 కొత్త MSME విస్తరణ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు. సీఎం చంద్రబాబు ‘ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్యానికి అనుగుణంగా ఈ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా సాంకేతిక సహాయం, నైపుణ్యాభివృద్ధి, ఇంక్యుబేషన్ సేవలు అందించి.. కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు.
News December 19, 2025
VZM: ‘ప్రతి పోలింగ్ బూత్కు BLA అవసరం’

విజయనగరం జిల్లాలో ప్రతి పోలింగ్ బూత్కు రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)ను నియమించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. అధికారులతో గురువారం తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. బీఎల్ఏల నియామకంతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 15.73 లక్షల ఓటర్లు ఉన్నారని, ఓటరు చేర్పులు, మార్పులు, తొలగింపులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.


