News February 8, 2025
VZM: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికి?

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికిస్తుందనే విషయంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుత MLC పాకలపాటి రఘువర్మ నామినేషన్ వేసిన సందర్భంగా TDP ఎమ్మెల్సీ చిరంజీవిరావు మాట్లాడుతూ కూటమి మద్దతు రఘువర్మకేనని ప్రకటించారు. అయితే పీఆర్టీయూ, STUల మద్దతుతో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ శుక్రవారం హాజరై మద్దతు ప్రకటించారు.
Similar News
News April 19, 2026
కొండపల్లి బొమ్మల పండగ.. డ్రమ్స్ వాయించిన కలెక్టర్

కొండపల్లి బొమ్మల పండగ ఆదివారం కనులపండువగా సాగింది. ఉత్సవంలో భాగంగా రాత్రి కలెక్టర్ లక్ష్మీశ డ్రమ్స్ వాయించి కళాకారులను, టూరిస్ట్‌లను ఉత్సాహపరిచారు. ఈ ఉత్సవంలో సుమారు 250 మంది కళాకారులు పాల్గొన్నారు. డప్పు, పులి వేషాలు, తప్పెటగుళ్లు, థింసా, గరగలు, కీలు గుర్రాలు వంటి 12 రకాల సంప్రదాయ కళల కళాకారుల ప్రదర్శనలు అబ్బుపరిచాయి. ఈ పండగ కొండపల్లి వైభవాన్ని చాటుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఓపెనర్ల పరుగుల వరద.. తీవ్ర పోటీ

టీమ్‌ఇండియా ఓపెనింగ్ స్లాట్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. IPLలో భారత ఓపెనర్లు పరుగుల వరద పారిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, సంజూ శాంసన్, అభిషేక్, ఇషాన్ కిషన్, గిల్, KL రాహుల్, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు గిల్ 251 (4 మ్యాచులు), వైభవ్ 246 (6), జైస్వాల్ 223 (6), ఇషాన్ 213 (6), ప్రియాన్ష్ 211 (5), ప్రభ్‌సిమ్రన్ సింగ్ 211 (6), అభిషేక్ 188 (6) రన్స్ చేశారు.