News July 19, 2024

VZM: ఏయూ వీసీగా కొత్తపల్లి వాసి

image

గరుగుబిల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గొట్టాపు శశిభూషణరావును విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఈయన ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. ఏయూలో సీయూసీ అధ్యాపకుడిగా 19 ఏళ్ల అనుభవం ఆయనకు ఉంది. 15 ఏళ్ల పాటు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, ఇస్రోలో పనిచేశారు. ఆయన ఉన్నత స్థాయికి వెళ్లడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 3, 2025

VZM: మొంథా బీభత్సం.. 665.69 హెక్టార్లలో పంటల నష్టం..!

image

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో పలు మండలాల్లో పంటలకు గణనీయమైన నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు తెలిపారు. జిల్లాలోని 27 మండలాల్లో పంట నష్టాల అంచనా పూర్తయిందని ఆయన తెలిపారు. మొత్తం 665.69 హెక్టార్లలో 3,076 మంది రైతులు పంట నష్టాన్ని ఎదుర్కొన్నారని, వరి 644.03 హెక్టార్లు, మొక్కజొన్న 6.40 హెక్టార్లు, పత్తి 4.93 హెక్టార్లు, మినుములు 1.01 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వివరించారు.

News November 2, 2025

దేవాలయాల వద్ద ఏర్పాట్లుపై కలెక్టర్ సూచనలు

image

కార్తీక సోమవారం సందర్భంగా జిల్లాలోని వివిధ దేవాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని, దేవాలయాలపై కన్నేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా ఉండేలా అధికారులు, దేవస్థాన నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులు క్రమశిక్షణగా, శాంతియుతంగా దర్శనాలు ముగించుకోవాలన్నారు.

News November 2, 2025

విజయనగరం టీంకు ఓవరాల్ ఛాంపియన్ షిప్

image

ఏలూరులో జరిగిన 69వ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో అండర్-17 విభాగంలో విజయనగరం బాలికలు జట్టు ఓవరాల్ ఛాంపియన్ షిప్ గెల్చుకుంది. ఉమ్మడి 13 జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారు జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు వెళ్తారు. వీరందరినీ రాష్ట్ర స్కూల్ గేమ్స్ అబ్జర్వర్ వెంకటేశ్వరరావు అభినందించారు. జిల్లా పేరును జాతీయస్థాయిలో కూడా మార్మోగించాలన్నారు.