News March 30, 2024

VZM: ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

image

పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన మక్కువ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీ కార్యదర్శి పి మురళి, సాల్విన్ సర్టిఫికెట్ నిమిత్తం చీకటి గణపతి అనే వ్యక్తి నుంచి రూ.2,600 తీసుకుంటూ ఏసీబీ డిఎస్పీ, సిబ్బందికి దొరికాడు. దీనిపై ఏసీబీ కేసు నమోదుచేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 31, 2025

విజయనగరం: ఓపెన్ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు ప‌క‌్కడ్భంధీ ఏర్పాట్లు

image

ఓపెన్ స్కూల్ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షలు పక్కడ్భంధీగా ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  అంబేడ్కర్ ఆదేశించారు. శనివారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభమవుతాయి అని ఆర్‌ఐ ఓ ఆదినారాయణ తెలిపారు. ఈ సమావేశంలో పలు శాఖలు అధికారులు పాల్గొన్నారు.

News January 31, 2025

 VZM: పోలీసు లాంఛనాలతో ‘వీనా’కు అంత్యక్రియలు

image

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో స్నిఫర్ డాగ్‌గా విశేషమైన సేవలందించి, మృతి చెందిన పోలీసు డాగ్ ‘వీనా’కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. 2014 సం.లో ఫిమేల్ స్నిఫర్ డాగ్‌గా ‘వీనా’ ఇంటిలిజెన్సు విభాగంలో శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు వచ్చినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. తన చివరి శ్వాస వరకు జిల్లా పోలీసుశాఖకు సేవలందించిందన్నారు.

News January 31, 2025

VZM: అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్: కలెక్టర్

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నిక కోసం ఈ నెల 29న షెడ్యూల్ వెలువడినందున ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ గురువారం తెలిపారు. ఈ ఎన్నిక కోసం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి, ఏ.ఎస్.ఆర్ జిల్లాల డి.ఆర్.ఓ లు సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఉంటారని తెలిపారు.