News June 11, 2024
VZM: ఒకే ఫ్రేమ్‌లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తొమ్మిదికి తొమ్మిది సీట్లు కైవసం చేసుకుంది. మంగళవారం విజయవాడలోని ఎన్డీఏ శాసనసభ పక్ష నేత ఎన్నిక సభలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఒకే ఫ్రేమ్‌లో ఫొటో దిగారు.
Similar News
News March 22, 2025
VZM: జాగ్రత్త.. తేదీలను చింపేసి మరీ అమ్మకాలు!

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాప్స్, ఏజెన్సీలపై విజిలెన్స్ తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో నివ్వెర పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది అక్రమార్కులు అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మత్తును కలిగించే ఔషధాలను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నారు. వాటిపై ముద్రించిన తయారీ, ఎక్స్‌పైరీ తేదీలను చించి మరీ అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.
News March 22, 2025
జిల్లాలో రక్తహీనత తగ్గింది: కేంద్ర బృందం

రక్తహీనతను నివారించేందుకు ప్రవేశపెట్టిన పలు పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేస్తున్న కారణంగానే జిల్లాలో రక్తహీనత తగ్గిందని జిల్లాలో పర్యటించిన కేంద్ర ప్రభుత్వ వైద్య నిపుణుల బృందం అభిప్రాయపడింది. కలెక్టర్ అంబేడ్కర్‌ను కేంద్ర బృంద ప్రతినిధులు శుక్రవారం కలిశారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత గుర్తించిన అంశాలను కలెక్టర్‌కు వివరించారు.
News March 22, 2025
నిధులు ఇవ్వమని సీఎంను కోరుతా: VZM కలెక్టర్

జిల్లాకు ప్రధానమైన తోటపల్లి కుడి ప్రధాన కాల్వ, తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో సీఎంను కోరనున్నట్టు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో సమీక్ష జరిపారు.ఆయా ప్రాజెక్టుల పనులు, భూసేకరణ, పునరావాసం పూర్తిచేసేందుకు ఏమేరకు నిధులు అవసరమవుతాయో నివేదిక ఇవ్వాలని కోరారు.