News October 24, 2024
VZM: ఒకే రోజు హోం మంత్రి, మాజీ సీఎం పర్యటన
విజయనగరం జిల్లాలో నేడు హోం మంత్రి అనిత, వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. ఎన్నికల తర్వాత జగన్, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అయిన తర్వాత అనిత జిల్లాకు రావడం ఇదే మొదటిసారి. జగన్ ఉదయం 11 గంటలకు గుర్ల డయేరియా బాధితులను పరామర్మించి తిరిగి బెంగళూరు వెళ్లనున్నారు. హోం మంత్రి మధ్యాహ్నం 2 గంటలకు గుర్లలో పర్యటిస్తారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు.
Similar News
News November 5, 2024
TET RESULTS: విజయనగరం అమ్మాయికి 150/150 మార్కులు
ఏపీ టెట్ ఫలితాల్లో విజయనగరం అమ్మాయి సత్తా చాటింది. జిల్లా కేంద్రానికి చెందిన కొండ్రు అశ్విని ఎస్జీటీ(పేపర్1-ఏ)లో 150కి 150 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డీఎస్సీ సాధించడమే తన లక్ష్యమని పేర్కొంది. కాగా.. ఆమె 2014-2016 మధ్య డైట్ పూర్తి చేశారు.
News November 5, 2024
ఆర్డీవో కార్యాలయాల్లో కౌంటింగ్ కేంద్రాలు: విజయనగరం కలెక్టర్
శాసనమండలి ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం పార్వతీపురం, విజయనగరం ఆర్.డి.ఓ. కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. నవంబరు 28న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబరు 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జరుగుతుందన్నారు. డిసెంబరు 2 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
News November 5, 2024
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఓటర్ల సంఖ్య ఇదే..
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఓటర్లు మొత్తం 727మంది ఉన్నారు. వీరిలో పార్వతీపురం జిల్లాలో 325 మంది ఉండగా, ఇందులో పురుషులు 132, మహిళలు 193 మంది ఉన్నారు. విజయనగరం జిల్లాలో మొత్తం 402 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 239 మంది మహిళా ఓటర్లు, 163 పురుష ఓటర్లు ఉన్నారు. రాజకీయ పార్టీలు ముసాయిదా జాబితాపై తమ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను ఈ నెల 8వ తేదీ లోగా తెలియజేయవచ్చు.