News May 12, 2024

VZM: ఓటేసుందుకు వస్తుండగా మృతి..!

image

సీతానగరం మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన గవర ముసలినాయుడు (సాయి)(24) భూపాలపల్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రామగుండంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న సాయి..శనివారం తన స్నేహితులను దిగబెట్టడానికి వరంగల్‌ బస్టాండ్‌కు బైక్‌పై వెళ్లాడు. బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో వారిని టిప్పర్‌ ఢీకొట్టింది. సాయితో పాటు అతని స్నేహితుడు కూడా మరణించాడు. వీరు ఓటేసేందుకు వస్తున్నట్లు సమాచారం.

Similar News

News February 7, 2025

VZM: మన మంత్రికి మీరిచ్చే ర్యాంక్ ఎంత?

image

అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి గజపతినగరం MLAగా గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ చంద్రబాబు క్యాబినేట్‌లో MSME., సెర్ప్, NRI సాధికారత, సంబంధాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే 25 మంది మంత్రుల పనితీరుపై ర్యాంకులు కేటాయించగా కొండపల్లి మూడో ర్యాంకు సాధించారు. ఉత్తరాంధ్రలో సీనియర్లు అయిన అచ్చెన్నకు 17, అనితకు 20, సంధ్యారాణికి 19 ర్యాంక్ ఇచ్చారు. మరి కొండపల్లి పనితీరుకు మీరెచ్చే ర్యాంకు ఎంత?

News February 7, 2025

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: VZM SP

image

విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మార్చి 8 వరకు జిల్లాలో కోడ్ అమల్లో ఉంటుందని, పక్కాగా అమలయ్యేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నేతల ఫొటోలు ఉండరాదన్నారు. ముఖ్యంగా బెల్టు షాపులు లేకుండా చూడాలని, విస్తృతంగా దాడులు నిర్వహించాలని ఆదేశించారు.

News February 6, 2025

VZM: ‘క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి’

image

క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారిణి జీవన రాణి సూచించారు. వైద్య శాఖ కార్యాలయంలో జిల్లాలో పీహెచ్సీ, సీహెచ్సీ వైద్యులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మాతృ సేవలు, జేఎస్ వై, పీఎం మాతృ సురక్ష అభియాన్, తదితర కార్యక్రమాలపై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే శత శాతం ప్రసవాలు అయ్యేలా చూడాలని సిబ్బందికి సూచించారు.

error: Content is protected !!