News September 2, 2024

VZM: కరెంట్ షాక్‌తో బాలుడు మృతి

image

ఎస్.కోట మండలం మూలబొడ్డవార పంచాయతీ మరుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ పోల్ ముట్టుకోవడంతో విద్యుత్ షాక్‌తో చంటిబాబు అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆరు బయట ఆదుకుంటూ, పక్కనే ఉన్న విద్యుత్ పోల్‌ను ముట్టుకున్నాడు. వర్షానికి తడిసి ఉన్న కరెంట్ పోల్ కరెంట్ షాక్ కొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాబు మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Similar News

News October 26, 2025

VZM: తుఫాను కంట్రోల్ రూమ్‌ పరిశీలించిన ప్రత్యేకాధికారి

image

విజయనగరం జిల్లా తుఫాను ప్రత్యేకాధికారి రవి సుభాష్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఆదివారం పరిశీలించారు. తుఫాన్ సన్నద్ధతపై వివిధ శాఖలపై ముందస్తుగా సమీక్షించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్.దామోదర్, ఇతర అధికారులు ప్రత్యేకాధికారికి వివరించారు.

News October 26, 2025

VZM: తుఫాను ఎఫెక్ట్.. ప్రత్యేకాధికారిగా సుభాష్

image

మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది. రేపటి నుంచి జిల్లాలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వివిధ జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించింది. విజయనగరం జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారిగా సుభాష్‌ను నియమిస్తూ ప్రభుత్వం నేడు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన జిల్లాకు చేరుకున్నారు.

News October 26, 2025

VZM: 3 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు

image

మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశాలతో 27, 28, 29వ తేదీల్లో సెలవులు ప్రకటిస్తున్నట్లు RIO తవిటినాయుడు, ICDS పీడీ శాంతకుమారి తెలిపారు. అన్ని కళాశాలలు మూసివేయాలని, ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదని సూచించారు. కాగా.. 3 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు <<18111583>>పాఠశాలలకు<<>> సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.