News February 4, 2025

VZM: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కరెంట్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన పాచిపెంట మండలం కర్రివలసలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకట సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రామభద్రపురం మండలం గొళ్ళలపేట గ్రామానికి చెందిన కె.రామారావు కర్రివలసలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుత్ లైన్లు తగిలి మృతి చెందాడు. మృతుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News February 4, 2025

ఆర్మీ చీఫ్ మాటల్ని RG వక్రీకరించారు: రాజ్‌నాథ్

image

దేశ భద్రతపై రాహుల్‌గాంధీవి బాధ్యతా రాహిత్య రాజకీయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మండిపడ్డారు. భారత్-చైనా సరిహద్దు పరిస్థితులపై ఆర్మీ చీఫ్ చెప్పని మాటలను చెప్పినట్టుగా ఆయన వక్రీకరించారని విమర్శించారు. గస్తీ అంశంలో వివాదం తలెత్తినట్టు మాత్రమే చెప్పారన్నారు. 1962లో చైనా 38k sqkm ఆక్రమించిందని, 1963లో 5k sqkmను పాక్ ఆక్రమించి చైనాకు ఇచ్చిందన్నారు. రాహుల్ చరిత్ర తెలుసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

News February 4, 2025

అందోల్: క్యాన్సర్ నియంత్రణపై దృష్టి: మంత్రి

image

క్యాన్సర్ వ్యాధి నియంత్రణపై పూర్తిస్థాయి దృష్టి సారించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ పై అవగాహన పెంపొందించడానికి, నివారణ, గుర్తింపును ప్రారంభదశలో చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతియేటా ఫిబ్రవరి 4వ తేదీని పురస్కరించకుని ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

News February 4, 2025

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటా: కడప ఎస్పీ

image

జిల్లాలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలకు ఎటువంటి ఆపద కలిగినా తాను అండగా ఉండి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ భరోసా ఇచ్చారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏపీ పోలీస్ అధికారుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోలీస్ డైరీ -2025ను ఎస్పీ ఆవిష్కరించారు. ఏఎస్పీ ప్రకాశ్ బాబు, పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

error: Content is protected !!