News February 4, 2025
VZM: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

కరెంట్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన పాచిపెంట మండలం కర్రివలసలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకట సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రామభద్రపురం మండలం గొళ్ళలపేట గ్రామానికి చెందిన కె.రామారావు కర్రివలసలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుత్ లైన్లు తగిలి మృతి చెందాడు. మృతుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News April 19, 2026
IPL: అద్భుత విజయం

IPL-2026: గెలుపు అసాధ్యం అనుకున్న దశలో KKR అద్భుత విజయం సాధించింది. RR నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యఛేదనలో తొలుత వరుసగా వికెట్లు కోల్పోయింది. 70కే 5 వికెట్లు పడిన దశలో రింకూ (53*), అనుకుల్ రాయ్ (29*) బౌండరీలతో మ్యాచును గెలిపించారు. వీరిద్దరూ కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సీజన్లో KKRకు ఇదే తొలి విజయం.
News April 19, 2026
రేపు అచ్యుతాపురం, రాంబిలిల్లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పర్యటన

అచ్యుతాపురం, రాంబిల్లిలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ఈనెల 20న పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అచ్యుతాపురంలో నిర్వహించే సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రాంబిల్లి వెళ్తారు. ఈనెల 23న సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు విశాఖ బయలుదేరుతారు.
News April 19, 2026
NRPT: ప్రజలు గొలుసుకట్టు వ్యాపారాలకు దూరంగా ఉండాలి

ప్రజల సొమ్ము దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్తకొత్త పోకడలతో ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకునేందుకు కొత్త పంథాను ప్రయోగిస్తున్నారని వాటి మాయలో పడి ఆర్థికంగా నష్టపోవద్దని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పథకాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.


