News January 25, 2025

VZM: కలెక్టరేట్‌లో నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

image

15వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు విజయనగరం కలెక్టరేట్‌లో శనివారం జరగనున్నాయి. ఉదయం 10-30 గంటలకు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఘనంగా జరుగుతాయని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారన్నారు.

Similar News

News December 7, 2025

గడిచిన 20 రోజుల్లో 45 మందికి జైలు శిక్ష: VZM SP

image

రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని SP దామోదర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. గడిచిన 20 రోజుల్లో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో 45 మందికి జైలు శిక్ష పడిందని, హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారిపై 19,077కేసులు,మద్యం తాగి వాహనం నడిపిన వారిపై 5,510కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై 17,246కేసులు నమోదు చేశామన్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగించాలన్నారు.

News December 7, 2025

VZM: కలెక్టర్ ఆఫీస్‌లో రేపు పీజీఆర్ఎస్

image

విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పీజీఆర్ఎస్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలతో పాటు గత అర్జీల స్లిప్పులను తీసుకుని రావాలని సూచించారు. అర్జీ స్థితిగతుల కోసం మీకోసం కాల్ సెంటర్ 1100, అదేవిధంగా Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను వినియోగించుకోవచ్చు అన్నారు.

News December 7, 2025

55 మంది పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేసిన మంత్రి కొండపల్లి

image

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడి కార్పొరేషన్ మండలి (COSIDICI) ఆధ్వర్యంలో శనివారం విశాఖలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 55 మంది పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేశారు. ఇందులో రాష్ట్ర ఆర్థిక సంస్థ ద్వారా రుణాలు పొందిన 16 మంది పారిశ్రామికవేత్తలకు జాతీయ గౌరవ పురస్కారాలు లభించాయని మంత్రి తెలిపారు.