News March 29, 2024
VZM: కళా రాజకీయ నేపథ్యం ఇదే..

చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కళా వెంకట్రావును అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా రేగిడి గ్రామానికి చెందిన ఆయన టీడీపీ ఆవిర్భావంతోనే పార్టీలో చేరారు. ఉణుకూరు నియోజకవర్గం నుంచి 1983, 85, 89, 2004లో ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. వాణిజ్య, పురపాలక, హోం శాఖ మంత్రిగా, టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓటమి చెందారు.
Similar News
News December 2, 2025
బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి

బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేట్ కళాశాలలో చదవ లేక పేదలు విద్యకు దూరం అవుతున్నారని చెప్పారు.
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.