News January 3, 2025

VZM: కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 259 మంది గైర్హాజరు

image

విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది . మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 341 మంది అభ్యర్థులు మాత్రమే PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. రెండో రోజు 259 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కాగా ఎంపిక ప్రక్రియ గురువారం ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరిగింది.

Similar News

News September 13, 2025

నేడు విజయనగరం కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ

image

విజయనగరం జిల్లా కొత్త కలెక్టర్‌గా నియమితులైన ఎస్.రామసుందర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో అధికారికంగా బాధ్యతలు చేపడతారు. ఇప్పటివరకు ఆయన రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కమిషనర్‌గా, సీడీఏ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. పూర్వ కలెక్టర్ అంబేడ్క‌ర్‌కు బదిలీ కాగా ఇంకా పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.

News September 13, 2025

VZM: రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ఎంపికలు

image

రాష్ట్రస్థాయి జూడో పోటీల ఎంపికను ఆరికతోట జడ్పీ హైస్కూల్లో చేపట్టారు. ఇందులో 50 మంది విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా జూడో అసోషియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రత్నకిశోర్ తెలిపారు. అండర్14, 17, 19 జిల్లా జూడో టీం ఎంపిక నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 25 పాఠశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 25 మంది బాలికలు, 25 మంది బాలురు రాష్ట్రస్థాయి జూడో పోటీలకు వెళ్లనున్నట్లు చెప్పారు.

News September 12, 2025

విజయనగరం కలెక్టర్‌కు సన్మానం

image

విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్‌‌ను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. జిల్లా నుంచి బదిలీ అయిన నేపథ్యంలో రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది కలెక్టర్‌‌ను తన ఛాంబర్లో కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.