News January 17, 2025
VZM: కానిస్టేబుల్ ఎంపికలు.. 185 మంది గైర్హాజరు

విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహ దారుఢ్య ఎంపిక ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 415 మంది అభ్యర్థులు PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. 185 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
Similar News
News February 16, 2025
విశాఖలో IPL.. మ్యాచ్‌లు ఎప్పుడంటే..?

IPL అంటేనే అదొక మజా. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లి నేరుగా మ్యాచ్ చూడలేని వాళ్లు టీవీలు, మొబైల్లో ఐపీఎల్‌ను ఆస్వాదిస్తారు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్‌లను ఈ సీజన్‌లో విశాఖ ప్రజలు నేరుగా చూడవచ్చు. ఢిల్లీ జట్టు విశాఖ స్టేడియాన్ని తమ హోం గ్రౌండ్‌గా ఎంచుకోవడంతో ఇక్కడ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 24న లక్నోతో, 30న సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఢిల్లీ తలపడనుంది.
News February 16, 2025
రామతీర్థంలో 26 నుంచి శివరాత్రి జాతర

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడురోజుల పాటు శివరాత్రి జాతర మహోత్సవం జరగనుంది. 26, 27 తేదీల్లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. శివరాత్రి నాడు లక్షలాది మంది భక్తులు జాగరణ చేస్తారు. 28న వేద పారాయణం అనంతరం స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం జరిపిస్తారు. జాతరకు ఉత్తరాంధ్ర నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
News February 16, 2025
నెల జీతం విరాళంగా ఇచ్చిన విజయనగరం ఎంపీ

తలసేమియాతో బాధపడుతున్న రోగుల చికిత్స నిమిత్తం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. విజయవాడలో తలసేమియా రోగుల కోసం శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఏడాది రోగుల కోసం తన వంతుగా ఒక నెల జీతాన్ని అందజేస్తానని ఎంపీ తెలిపారు. ఈ మొత్తాన్ని ఎన్టీఆర్ ట్రస్టుకు జమచేస్తానని వెల్లడించారు.