News January 22, 2025
VZM: కానిస్టేబుల్ ఎంపికలు..448 మంది ఎంపిక
విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య ఎంపిక ప్రక్రియ మంగళవారం సజావుగా జరిగింది. మొత్తం 652 మంది అభ్యర్థులు PMT, PET పరీక్షలకు హాజరయ్యారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వీరిలో 448 మంది తుది రాత పరీక్షకు ఎంపికయ్యారన్నారు. గడిచిన 15 రోజులుగా జరుగుతున్న ఎంపిక ప్రక్రియలో ఇప్పటి వరకు 3,745 మంది పురుష అభ్యర్థులు, 479 మంది మహిళ అభ్యర్థినులు రాత పరీక్షకు ఎంపికయ్యారన్నారు.
Similar News
News January 23, 2025
విజయనగరం జిల్లాలో 5 ఆసుపత్రులు.. 13 ప్రత్యేక వైద్య బృందాలు
విజయనగరం జిల్లాలో గురువారం నుంచి దివ్యాంగుల పింఛన్ల పరిశీలన కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం జిల్లాలోని ఐదు ఆసుపత్రులు, 13 ప్రత్యేక వైద్య బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. శారీరక దివ్యాంగుల కోసం గజపతినగరం, చీపురుపల్లి, రాజాం, ఎస్ కోట, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు, అందుల కోసం రాజాం, GGH, ఘోసాసుపత్రి, మూగ చెవిటి వారి కోసం GGH, ఘోషాసుపత్రిలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
News January 23, 2025
VZM: నేడు మంత్రి కొండపల్లి షెడ్యూల్
రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం ఉదయం 8గంటలకు పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లాలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4గంటలకు గజపతినగరం RTC కాంప్లెక్స్ వద్ద శ్రీ కన్వెన్షన్లో పి.యమ్.సూర్య ఘర్ పథకం అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి కార్యాలయం తెలిపింది.
News January 22, 2025
VZM: కానిస్టేబుల్ అభ్యర్థి మృతి
దత్తిరాజేరు మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ అభ్యర్థి బౌడుపల్లి రవి కుమార్ (22) బుధవారం మృతి చెందినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జనవరి 21న విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించిన పీఈటీ పరీక్షలకు రవి హాజరయినట్లు చెప్పారు. 1,600 మీటర్ల పరుగులో పాల్గొని అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, విశాఖలోని ఓ అసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.