News January 22, 2025
VZM: కానిస్టేబుల్ ఎంపికలు..448 మంది ఎంపిక

విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య ఎంపిక ప్రక్రియ మంగళవారం సజావుగా జరిగింది. మొత్తం 652 మంది అభ్యర్థులు PMT, PET పరీక్షలకు హాజరయ్యారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వీరిలో 448 మంది తుది రాత పరీక్షకు ఎంపికయ్యారన్నారు. గడిచిన 15 రోజులుగా జరుగుతున్న ఎంపిక ప్రక్రియలో ఇప్పటి వరకు 3,745 మంది పురుష అభ్యర్థులు, 479 మంది మహిళ అభ్యర్థినులు రాత పరీక్షకు ఎంపికయ్యారన్నారు.
Similar News
News February 8, 2025
VZM: జిల్లా ఎస్పీ దృష్టికి పోలీస్ సిబ్బంది సమస్యలు

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సంక్షేమ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ వకుల్ జిందాల్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఎస్పీ పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పోలీస్ సిబ్బంది తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని స్పష్టం చేశారు.
News February 7, 2025
VZM: మన మంత్రికి మీరిచ్చే ర్యాంక్ ఎంత?

అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి గజపతినగరం MLAగా గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ చంద్రబాబు క్యాబినేట్‌లో MSME., సెర్ప్, NRI సాధికారత, సంబంధాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే 25 మంది మంత్రుల పనితీరుపై ర్యాంకులు కేటాయించగా కొండపల్లి మూడో ర్యాంకు సాధించారు. ఉత్తరాంధ్రలో సీనియర్లు అయిన అచ్చెన్నకు 17, అనితకు 20, సంధ్యారాణికి 19 ర్యాంక్ ఇచ్చారు. మరి కొండపల్లి పనితీరుకు మీరెచ్చే ర్యాంకు ఎంత?
News February 7, 2025
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: VZM SP

విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మార్చి 8 వరకు జిల్లాలో కోడ్ అమల్లో ఉంటుందని, పక్కాగా అమలయ్యేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నేతల ఫొటోలు ఉండరాదన్నారు. ముఖ్యంగా బెల్టు షాపులు లేకుండా చూడాలని, విస్తృతంగా దాడులు నిర్వహించాలని ఆదేశించారు.