News June 11, 2024

VZM: కిమిడి కళావెంకట్రావుకు లైన్ క్లియర్?

image

ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య ఆఖరి నిమిషంలో చీపురుపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కిమిడి కళావెంకట్రావుకు ఏపీ కొత్త కేబినెట్లో చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కళా వెంకట్రావు.. చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న కీలకనేతలకు స్వయంగా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కేబినెట్లో చోటుపై అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.

Similar News

News November 16, 2025

ఈ ఏడాది 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యం: మంత్రి

image

జిల్లాలో ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి రైతు తన పంటను అధికారిక కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గజపతినగరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. గత ఏడాది 3.34లక్షల వేలు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం, ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేలా లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు.

News November 16, 2025

గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలి: కలెక్టర్

image

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు, గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కరించిన తర్వాత SMS ద్వారా సమాచారం చేరవేస్తామని తెలిపారు.

News November 16, 2025

కుష్ఠు వ్యాధి గుర్తింపుపై స్పెషల్ డ్రైవ్: కలెక్టర్

image

జిల్లాలో కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధిని గుర్తించేందుకు రేపటి నుంచి 30 వరకు 14 రోజుల ప్రత్యేక డ్రైవ్‌ను చేపడుతున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ డ్రైవ్‌లో ఆరోగ్య బృందాలు ప్రతి ఇంటినీ సర్వే చేస్తాయి. ​కుష్ఠును పూర్తిగా నయం చేయగలిగేదని, ప్రారంభంలో గుర్తించడం అత్యంత కీలకమని కలెక్టర్ తెలిపారు. ఎటువంటి లక్షణాలు ఉన్నా పరీక్షించుకోవాలని సూచించారు.