News June 12, 2024

VZM: కేబినెట్‌లోకి ఇద్దరు.. ఎవరికి ఏ మంత్రి పదవి?

image

చంద్రబాబు కేజినెట్‌లోకి జిల్లా నుంచి ఇద్దరిని తీసుకుంటున్నారు. అయితే గత ప్రభుత్వంలో బొత్సకు ఫుల్‌టైమ్ మంత్రి పదవి ( 2.1/2 ఏళ్లు మున్సిపల్ శాఖ, 2.1/2 ఏళ్లు విద్యాశాఖ) ఇచ్చింది. మన్యంలో మొదటి 2.1/2 ఏళ్లు పుష్ప శ్రీవాణికి డిప్యూటీ సీఎం & గిరిజన శాఖా మంత్రి పదవి ఇవ్వగా.. మరో 2.1/2 ఏళ్లు రాజన్నదొరకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ కేబినెట్‌లో ఎవరికి ఏ మంత్రి పదవి వస్తుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Similar News

News November 6, 2024

VZM: డీఎస్సీలో పోస్టులు మినహాయించాలని వినతి

image

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని గిరిజన ఆశ్రమ పాఠశాల ఒప్పంద ఉపాధ్యాయులు కోరారు. ఈ మేరకు మంగళవారం సాలూరులో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం విడుదల చేసే డీఎస్సీలో తమ పోస్టులు మినహాయించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని యూనియన్ నాయకులు తెలిపారు.

News November 6, 2024

VZM: ఎన్నికల నియమావళి అమలుకు బృందాల ఏర్పాటు

image

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించినట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. మున్సిపల్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, MRO, MPDO, SI సభ్యులుగా ఉంటారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో  MRO, MPDO, ఎస్ఐ ఈ బృందంలో సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు.

News November 5, 2024

VZM: సింగిల్ విండో ద్వారా రాజకీయ పార్టీలకు అనుమతులు

image

విజయనగరం జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీల అభ్యర్థులకు సింగిల్ విండో ద్వారా అవసరమైన అనుమతులు మంజూరు చేయనున్నట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అంబేడ్కర్ వెల్లడించారు. ఈ సింగిల్ విండో సెల్‌కు నోడల్ అధికారిగా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎల్.జోసెఫ్ వ్యవహరిస్తారని, బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనల నిర్వహణకు అనుమతులు ఆయనే ఇస్తారని చెప్పారు.