News March 29, 2024
VZM: కేబీఆర్ భవిష్యత్ కార్యాచరణపై నేడు కీలక ప్రకటన

నెల్లిమర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ కర్రోతు బంగార్రాజు తన అనుచరులతో ఈరోజు సాయంత్రం సమావేశం కానున్నారు. తొలుత నెల్లిమర్ల నియోజకవర్గ టికెట్‌ను ఆయన ఆశించగా పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లింది. భీమిలి ఎమ్మెల్యే టికెట్ లేదా విజయనగరం ఎంపీ టికెట్‌ను కేటాయిస్తారని ఆశతో ఎదురుచూసినప్పటికీ ప్రకటించకపోవడంతో అత్యవసర సమావేశానికి తన అనుచరులకు పిలుపునిచ్చారు.
Similar News
News February 25, 2026
VZM: సుప్రీంకోర్టు నుంచి అంటూ ఫోన్.. భారీగా దోపిడీ

విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగికి సుప్రీంకోర్టు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.89 లక్షలు కాజేయడంతో నష్టపోయానని తెలుసుకున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయనగరానికి చెందిన సీహెచ్ రవి ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.

News February 24, 2026
VZM: పీఎం శ్రీ పాఠశాలల తనిఖీకి కేంద్ర నోడల్ అధికారి

పీఎం శ్రీ పాఠశాలల అమలును పరిశీలించేందుకు జిల్లాకు కేంద్ర నోడల్ అధికారిగా జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి నీరజ్ కుమార్ గయాగిని నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని మంగళవారం కలిశారు. విజయనగరం జిల్లాలో 37 పీఎం శ్రీ పాఠశాలలు ఉన్నాయని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధే ఈ పథకం లక్ష్యమని కలెక్టర్ చెప్పారు. 2022-24 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.60 కోట్ల నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు.