News December 11, 2024
VZM: కొత్తగా వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పాటు..!

వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో పార్వతీపురం, సాలూరు, కురుపాం, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, పూసపాటిరేగ, కొత్తవసల, మెరకముడిదాం మార్కెట్లు ఉన్నాయి. 20 మందితో కమిటీ ఏర్పాటు చేస్తారు. వీరిలో MLA, 12 మంది రైతులు, ముగ్గురు వ్యాపారులు, కోపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏడీ, సర్పంచ్, వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు, గ్రామ సర్పంచ్ ఉంటారు.
Similar News
News November 12, 2025
ప్రతీ మండలంలో వెయ్యి మందికి ఉపాధి పనులు: VZM కలెక్టర్

జిల్లాలో ఉపాధి పనులు వేగవంతం చేయాలని, ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఉపాధి పనులపై జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన డ్వామా, ఏపీడీలు, MPDOలు, ఏపీవోలతో మండలాల వారీగా సమీక్షించారు. మెంటాడ, రామభద్రపురం, సంతకవిటి, రాజాం, కొత్తవలస, భోగాపురం, గుర్ల మండలాలు పనిదినాల కల్పనలో వెనుకబడ్డాయని, 1000 మంది శ్రామికులకు పని కల్పించాలన్నారు.
News November 12, 2025
VZM: ‘రుణాల రికవరీ వందశాతం ఉండాలి’

రుణాల రికవరీ వందశాతం ఉండాలని DRDA పీడీ శ్రీనివాస్ పాణి ఆదేశించారు. స్థానిక DRDA కార్యాలయంలో ‘మన డబ్బులు.. మన లెక్కలు’ కార్యక్రమంపై మంగళవారం సమావేశం నిర్వహించారు. రుణాల లక్ష్యాన్ని సిబ్బంది చేరుకోవాలని కోరారు. గ్రామ స్థాయి సిబ్బందితో సమన్వయం తప్పనిసరిగా ఉండాలన్నారు. మహిళల ఆర్థికాభివృద్దిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో APD సావిత్రి, DPMలు చిరంజీవి, లక్ష్మీ నాయుడు పాల్గొన్నారు.
News November 12, 2025
VZM: నేడు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నిరసన కార్యక్రమాలు

జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నేడు వైసీపీ నిరసన ర్యాలీలు చేపట్టనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యానికి అప్పగించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేపడుతున్నట్లు జిల్లా పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయాల వరకు ర్యాలీలు కొనసాగనున్నాయని తెలిపింది.


