News September 20, 2024
VZM: గురజాడ జయంతికి సర్వం సిద్ధం

విజయనగరంలో శనివారం నిర్వహించనున్న మహా కవి శ్రీ గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. గురజాడ స్వగృహంతో పాటు ఆయన విగ్రహం వద్ద విద్యుత్ దీపాల అలంకరణను అధికారులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో గురజాడ నివాసం విద్యుత్ అలంకరణలో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. కలెక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.
Similar News
News October 24, 2025
మత్స్యకారులను రప్పించేందుకు చర్యలు వేగవంతం: కలెక్టర్

బంగ్లాదేశ్ చెరలో చిక్కుకున్న విజయనగరం జిల్లా మత్స్యకారులను సురక్షితంగా రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ, ఢాకాలోని భారత హైకమిషన్తో నిరంతర సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ద్వారా అధికారిక చర్చలు కొనసాగుతున్నాయన్నారు.
News October 23, 2025
ఆండ్ర రిజర్వాయర్ నుంచి నీరు విడుదల

ఆండ్ర జలాశయంలోకి గురువారం సాయంత్రం ఇన్ ఫ్లో 750 క్యూసెక్కుల వరద నీరు రావడంతో స్పిల్వే రెండో గేట్ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని చంపావతి నదిలోకి విడుదల చేశామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. చంపావతి నది పరివాహక ప్రాంతాలైన అనంతగిరి, మెంటాడ మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలో నీటి మట్టం పెరిగిందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 23, 2025
సహకార సంస్థలు తమ డేటాను అందించాలి: కలెక్టర్

జిల్లాలో ఉన్న సహకార సంస్థలు తమ డేటాను జిల్లా సహకార అధికారికి అందించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్లో కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. డేటాను నేషనల్ కో-ఆపరేటివ్ డేటా బేస్ పోర్టల్లోఅప్డేట్ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో 19,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోడౌన్ స్పేస్ అందుబాటులో ఉందని, వినియోగంలోకి తేవాలని సూచించారు.