News January 19, 2025

VZM: గూగుల్ సెర్చ్ చేస్తున్నారా.. మీరే టార్గెట్

image

గూగుల్ సెర్చ్ చేస్తున్నవారినే టార్గెట్‌గా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని విజయనగరం SP వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఎక్కువ మంది తమకు అవసరమైన వాటిని గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా వెతుకుతున్నారని ఆయన అన్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌లను క్రియేట్ చేసి సెర్చ్ చేసే సమయంలో ఆ సైట్‌‌ ముందు వరుసలో వచ్చేలా చేసి డబ్బులు దోచుకుంటున్నారని, పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాన్నారు.

Similar News

News February 16, 2025

రామతీర్థంలో 26 నుంచి శివరాత్రి జాతర

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడురోజుల పాటు శివరాత్రి జాతర మహోత్సవం జరగనుంది. 26, 27 తేదీల్లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. శివరాత్రి నాడు లక్షలాది మంది భక్తులు జాగరణ చేస్తారు. 28న వేద పారాయణం అనంతరం స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం జరిపిస్తారు. జాతరకు ఉత్తరాంధ్ర నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

News February 16, 2025

నెల జీతం విరాళంగా ఇచ్చిన విజయనగరం ఎంపీ 

image

తలసేమియాతో బాధపడుతున్న రోగుల చికిత్స నిమిత్తం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. విజయవాడలో తలసేమియా రోగుల కోసం శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఏడాది రోగుల కోసం తన వంతుగా ఒక నెల జీతాన్ని అందజేస్తానని ఎంపీ తెలిపారు. ఈ మొత్తాన్ని ఎన్టీఆర్ ట్రస్టుకు జమచేస్తానని వెల్లడించారు.

News February 16, 2025

వారి లైసెన్సులను రద్దు చేస్తాం: VZM కలెక్టర్

image

ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని, ఇక పై నిబంధనలు పాటించని వారి లైసెన్స్‌ను రద్దు చేస్తామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. వేగం కన్నా సురక్షితంగా చేరడం ముఖ్యమని, ప్రతి వాహన దారుడు తాను సురక్షితంగా ఉంటూ పక్క వారిని కూడా సురక్షితంగా ఉంచాలని అన్నారు.

error: Content is protected !!