News March 3, 2025
VZM: గెలుపు దిశగా గాదె.. దేనికి సంకేతం?

ఉపాధ్యాయ MLC ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడు గెలుపు దిశగా పయనిస్తున్నారు. మాజీ MLC రఘువర్మకు కూటమి మద్దతు పలికింది. ఆ దిశగా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజా ప్రతినిధులు రఘువర్మను గెలిపించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆయనను కాదని గాదెకే గురువులు పట్టం కట్టారనేది లెక్కింపులో స్పష్టమవుతుంది. సమస్యల పరిష్కారానికై ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారని పలువురు భావిస్తున్నారు.
Similar News
News March 4, 2025
VZM: మీ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉందా?

విజయనగరం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా తాగు నీటి సమస్య తలెత్తితే టెలిఫోన్ ద్వారా 9100120711 నంబర్‌కు తెలియజేయవచ్చునని కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్.డబ్ల్యు.ఎస్ ఆధ్వర్యంలో ఈ నంబర్ పని చేస్తుందని, తాగు నీటి సమస్యల పరిష్కారానికి నిత్యం సిబ్బంది అందుబాటులో ఉంటారని కలెక్టర్ స్పష్టం చేశారు. >Share it
News March 4, 2025
VZM: 4వేల మంది మహిళలతో మహిళా దినోత్సవం

మార్చి 8న నిర్వహించే మహిళా దినోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఏర్పాట్లపై కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సుమారు 4 వేల మంది మహిళలతో విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు.
News March 3, 2025
హత్యాచారయత్నం ఘటనలో నిందితుడికి పదేళ్ల జైలు: SP

బొండపల్లి పోలీస్ స్టేషన్లో 2020లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో నిందితుడు తవిటయ్యకు పదేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. చంద్రంపేటకు చెందిన తవిటయ్య అదనపు కట్నం తేవాలని వేధిస్తుండేవాడని, ఈ క్రమంలో కన్నవారి ఇంటి వద్ద ఉన్న భార్య, ఇతర కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా పాకకు నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడడంతో అప్పట్లో కేసు నమోదైందన్నారు.