News July 14, 2024

VZM: గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 13 అంబేడ్క‌ర్ గురుకులాల్లో గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఈనెల 18న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లాల కో-ఆర్డినేటర్ ఫ్లోరెన్స్ తెలిపారు. తెలుగు, ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్, గణితం,జువాలజీ, హిందీ, ఎకనామిక్స్, పీడీ, స్టాఫ్ నర్స్ వంటి కొలువులకు నెల్లిమర్ల గురుకులంలో ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఉదయం 9:30కు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని సూచించారు. >Share it

Similar News

News October 27, 2025

జిల్లా పోలీస్ కార్యాలయానికి రావొద్దు: VZM SP

image

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ‘పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ సిస్టమ్‌’ (PGRS) రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదివారం ప్రకటించారు. “మొంథా” తుఫాను ప్రభావంతో వాతావరణం ప్రతికూలంగా మారుతున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదుదారులు ఎవ్వరూ రావద్దని, తుఫాను సమయంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలన్నారు.

News October 26, 2025

VZM: తుఫాను కంట్రోల్ రూమ్‌ పరిశీలించిన ప్రత్యేకాధికారి

image

విజయనగరం జిల్లా తుఫాను ప్రత్యేకాధికారి రవి సుభాష్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఆదివారం పరిశీలించారు. తుఫాన్ సన్నద్ధతపై వివిధ శాఖలపై ముందస్తుగా సమీక్షించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్.దామోదర్, ఇతర అధికారులు ప్రత్యేకాధికారికి వివరించారు.

News October 26, 2025

VZM: తుఫాను ఎఫెక్ట్.. ప్రత్యేకాధికారిగా సుభాష్

image

మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది. రేపటి నుంచి జిల్లాలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వివిధ జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించింది. విజయనగరం జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారిగా సుభాష్‌ను నియమిస్తూ ప్రభుత్వం నేడు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన జిల్లాకు చేరుకున్నారు.