News September 25, 2024
VZM: ఘాటెక్కిన ఉల్లి.. కిలో రూ.70కి పైనే
విజయనగరం జిల్లాలో ఉల్లి ధరలు ఘాటెక్కాయి. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.70 నుంచి 80 పలుకుతున్నాయి. దసరా సమీపిస్తుండగా పెరిగిన ఉల్లి ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పక్షం రోజుల నుంచి క్రమంగా ఉల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నెల క్రితం కిలో సుమారు రూ.35 లోపే ఉండేవి. పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News December 30, 2024
అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్లపై కనిపించకూడదు: ఎస్పీ
నూతన సంవత్సర వేడుకలను జిల్లాలో ప్రశాంతయుతంగా నిర్వహించుకోవాలని, వేడుకల పేరుతో ఎవరైనానిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 31 రాత్రి బహిరంగ ప్రదేశాల్లో, రహదారులపై నూతన సంవత్సర వేడుకలను నిర్వహించరాదన్నారు. రాత్రి 1 గంట దాటిన తర్వాత రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 30, 2024
విజయనగరంలో ప్రారంభమైన కానిస్టేబుల్ పీఈటీ టెస్టులు
పోలీస్ నియామకాలకు సంబంధించి అభ్యర్థులు పీఎంటీ, పీఈటీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు విజయనగరం పోలీస్ గ్రౌండ్లో జరుగుతున్న ఎంపికలను జిల్లా ఎస్పీ రకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రన్నింగ్, లాంగ్ జంప్, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంపికైన వారికి త్వరలో రాత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు ఎవరినీ నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా కోరారు.
News December 30, 2024
బొబ్బిలి: ప్రాణాలు తీసిన సరదా
పాఠశాలకు ఆదివారం సెలవు కావడంతో సరదా కోసం తల్లిదండ్రులతో పొలానికి వెళ్లారు. సరదా కోసం నూర్పిడి యంత్రం ఎక్కితే ఆ యంత్రం బోల్తా పడి బాలుడు ప్రాణాలను తీసింది. బొబ్బిలి మండలం గున్నతోటవలసకు చెందిన మణికంఠ మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నూర్పిడి యంత్రం ఎక్కవద్దని ట్రాక్టర్ యజమాని, తల్లిదండ్రులు చెప్పిన సరదా కోసం ఎక్కి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.