News September 25, 2024

VZM: ఘాటెక్కిన ఉల్లి.. కిలో రూ.70కి పైనే

image

విజయనగరం జిల్లాలో ఉల్లి ధరలు ఘాటెక్కాయి. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.70 నుంచి 80 పలుకుతున్నాయి. దసరా సమీపిస్తుండగా పెరిగిన ఉల్లి ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పక్షం రోజుల నుంచి క్రమంగా ఉల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నెల క్రితం కిలో సుమారు రూ.35 లోపే ఉండేవి. పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News October 7, 2024

పైడిమాంబ ఉత్సవాలు.. ఓం బిర్లాకు ఆహ్వానం

image

పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఢిల్లీలో సోమవారం కలిశారు. విజయనగరంలో ఈనెల 13, 14, 15వ తేదీల్లో జరగనున్న శ్రీపైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. ఈ మేరకు ఆహ్వాన పత్రిక, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని అందజేశారు.

News October 7, 2024

విజయనగరంలో వాలంటీర్ల నిరసన

image

విజయనగరంలో గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు సోమవారం ఉదయం నిరసనకు దిగారు. యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వాలంటరీల వ్యవస్థను కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలల గౌరవ వేతనం బకాయిలు చెల్లించాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో బలవంతంగా రాజీనామాలు చేయించిన వాలంటీర్లను కొనసాగించాలని కోరారు.

News October 7, 2024

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ షెడ్యూల్ ఇదే

image

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఉదయం 8 గంటలకు బొండపల్లి మండలం ముద్దూరు గ్రామంలో శ్రీ బంగారమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.