News November 19, 2024
VZM: ‘చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలి’

విజయనగరం జిల్లాలోని వాగులు గెడ్డలపై చెక్ డ్యామ్‌లు నిర్మించేందుకు వారం రోజుల్లోగా ప్రతిపాదనలు సమర్పించాలని జలవనరుల శాఖ అధికారులను కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. సోమవారం ఆ శాఖ ఇంజినీర్లతో తన కార్యాలయంలో సమీక్షించారు. ప్రాజెక్టుల పరిధిలో ఉన్న భూముల్లో ఆక్రమణలకు గురైన భూముల వివరాలను తనకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. ప్రాజెక్టుల మరమ్మతులు నిర్వహణ పనుల కోసం మంజూరైన నిధుల వివరాలు చెప్పాలన్నారు.
Similar News
News October 19, 2025
VZM: నిబంధనలు పాటించని బాణాసంచా వ్యాపారులు

నగరంలోని బాణాసంచా షాపు యజమానులు అగ్నిమాపక నిబంధనలు పాటించడం లేదు. KL పురంలో అధికారికంగా 8 షాపులు ఉండగా, తాత్కాలిక అనుమతులతో మరో 15 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ మంటలు చెలరేగితే ఆర్పేలా సంబంధిత పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ 25వేల లీటర్ల నీటి సామర్ధ్యంతో ఒక సంపు, నిర్మించుకోవాలి. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాల్సిన అగ్నిమాపక అధికారులు అటు వైపు చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
News October 18, 2025
VZM: ‘బాల, బాలికలకు సమాన అవకాశాలు’

అన్ని రంగాల్లో బాల, బాలికలకు నేడు సమాన అవకాశాలు ఉన్నాయని జిల్లా వైద్యారోగ్య అధికారిణి జీవనరాణి అన్నారు. సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఘోషాసుపత్రిని శనివారం సందర్శించారు. రెండో సంతానంగా ఆడబిడ్డలు పుట్టిన బాలింతల వద్దకు వెళ్లి లింగ వివక్షతపై అవగాహన కల్పించారు. బాలికలను చక్కగా చదివించాలని, నేడు అన్ని రంగాల్లో మహిళలదే పైచేయి అని తెలిపారు. లింగ వివక్షత చూపిస్తే చర్యలు తప్పవన్నారు.
News October 18, 2025
మిగిలిన బాణసంచాను జాగ్రత్తగా భద్రపరచాలి: SP

దీపావళి సందర్భంగా కేఎల్‌పురం శివార్లలో ఏర్పాటు చేసిన బాణసంచా షాపులను ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఆకస్మికంగా పరిశీలించారు. వ్యాపారులు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, షాపుల వద్ద నీరు, ఇసుక అందుబాటులో ఉంచాలని సూచించారు. గడువు ముగిసిన తరువాత మిగిలిన బాణసంచాను సురక్షిత గోడౌన్లలలో భద్రపర్చాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.