News November 19, 2024
VZM: ‘చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలి’

విజయనగరం జిల్లాలోని వాగులు గెడ్డలపై చెక్ డ్యామ్‌లు నిర్మించేందుకు వారం రోజుల్లోగా ప్రతిపాదనలు సమర్పించాలని జలవనరుల శాఖ అధికారులను కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. సోమవారం ఆ శాఖ ఇంజినీర్లతో తన కార్యాలయంలో సమీక్షించారు. ప్రాజెక్టుల పరిధిలో ఉన్న భూముల్లో ఆక్రమణలకు గురైన భూముల వివరాలను తనకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. ప్రాజెక్టుల మరమ్మతులు నిర్వహణ పనుల కోసం మంజూరైన నిధుల వివరాలు చెప్పాలన్నారు.
Similar News
News March 7, 2026
జాతీయ స్థాయి బ్యాట్మింటన్ పోటీలకు బొబ్బిలి వాసులు

విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాట్మింటన్ పోటీల్లో బొబ్బిలి పట్టణానికి చెందిన రమేష్ , వాసు 35
ఏళ్ల కేటగిరిలో పాల్గొని విజేతలుగా నిలిచారు. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు హాజరుకానున్నారు. వీరిని బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబీనాయన శుక్రవారం సత్కరించి, అభినందించారు. బొబ్బిలికి మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు.
News March 6, 2026
చీపురుపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో డెడ్ బాడీ కలకలం

చీపురుపల్లి రైల్వేస్టేషన్ శివారున రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు శ్రీకాకుళం రైల్వే జీఆర్పీ మధు సూదనరావు శుక్రవారం తెలిపారు. డెడ్ బాడీ నుంచి దుర్వాసన వస్తోందని, కుళ్లే స్థితికి చేరుకుండడంతో మూడు రోజుల క్రితం ప్రమాదం జరగవచ్చన్నారు. మృతుడు గల్ల చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడని, చేతిపై ఓ పచ్చబొట్టు ఉందన్నారు. గుర్తించిన వారు జీఆర్పీ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.
News March 6, 2026
VZM: ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీ ఆవిష్కరణ

ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరీను విడుదల చేసి అధికారులకు అందజేశారు. ప్రభుత్వ పరిపాలనలో రోజువారీ కార్యక్రమాలు, పరిపాలన సంబంధిత అంశాలను నమోదు చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, డీఆర్‌ఓ మురళీ, తదితరులున్నారు.


