News September 1, 2024

VZM: చెరువులో పడి.. వృద్ధురాలి మృతి

image

ప్రమాదవశాత్తు వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బొండపల్లి SI మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎం.కొత్తవలస గ్రామానికి చెందిన కంది అప్పలనరసమ్మ (75) ఆగస్టు 30 రాత్రి నుంచి కనిపించలేదని, 31వ తేదీన పెన్షన్ కూడా అందుకోలేదని అన్నారు. గ్రామ పరిధిలో గల బాడి చెరువులో అప్పలనరసమ్మ మృతదేహం తేలింది, మనవడు శ్రీనివాసరావు తెలపడంతో పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేశారు.

Similar News

News November 18, 2025

VZM: వారసుల ఎంట్రీ.. వచ్చే ఎన్నికల కోసమేనా..!

image

విజయనగరం జిల్లా రాజకీయాల్లో యువ నాయకులు ప్రజల్లో కలయ తిరుగుతున్నారు. చీపురుపల్లిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ అనూష విస్తృతంగా పర్యటనలు చేస్తుంటే.. ప్రస్తుత ఎమ్మెల్యే కళావెంకట్రావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు యాక్టీవ్ అయ్యారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కుమార్తె శ్రావణి, జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర సైతం వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

VZM: వినతులు కుప్పల తెప్పలు.. పరిష్కారం ఏ స్థాయిలో?

image

ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరుగుతున్న PGRS కార్యక్రమానికి ప్రజల నుంచి వినతులు పోటెత్తున్నాయి. వాటి పరిష్కారం ఏ స్థాయిలో ఉందనేది ప్రశ్నార్ధకంగా మారింది. వినతుల పరిష్కారం అంతంత మాత్రమేనని స్వయంగా అర్జీదారులే ఆరోపిస్తున్న పరిస్థితి. వినతుల పరిష్కారానికి కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది లైట్ తీసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.