News September 1, 2024
VZM: చెరువులో పడి.. వృద్ధురాలి మృతి
ప్రమాదవశాత్తు వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బొండపల్లి SI మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎం.కొత్తవలస గ్రామానికి చెందిన కంది అప్పలనరసమ్మ (75) ఆగస్టు 30 రాత్రి నుంచి కనిపించలేదని, 31వ తేదీన పెన్షన్ కూడా అందుకోలేదని అన్నారు. గ్రామ పరిధిలో గల బాడి చెరువులో అప్పలనరసమ్మ మృతదేహం తేలింది, మనవడు శ్రీనివాసరావు తెలపడంతో పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేశారు.
Similar News
News September 20, 2024
‘విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన’
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్ ఆదినారాయణ అన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన పాల్గొన్నారు. రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా చేపడుతున్న ఈ ఉద్యమానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
News September 19, 2024
మార్చి నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాలి: హౌసింగ్ ఎండి
జిల్లాలో నిర్మాణం ప్రారంభించిన ఇళ్లన్నింటినీ మార్చి నెలాఖరులోగా శతశాతం పూర్తిచేయాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎం.డి. పి.రాజాబాబు హౌసింగ్ ఇంజనీర్లను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలను కాలవ్యవధి ప్రకారం పూర్తిచేయాలని స్పష్టంచేశారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆయన గుంకలాం తదితర ఇళ్ల కాలనీలను సందర్శించి ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు.
News September 19, 2024
ఆంధ్రా-ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిని విస్తరించండి: ఎంపీ
ఆంధ్ర- ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు, కేంద్ర రోడ్డు రవాణా& హైవేస్ మంత్రికి గురువారం వినతిపత్రాలు అందజేశారు. రామభద్రపురం-రాయగడ రహదారిని విస్తరించాలని, అలాగే, ప్రస్తుతం చాలా అధ్వానంగా ఉన్న కూనేరు-రాయగడ రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని ఎంపీ కోరారు.