News July 13, 2024

VZM: జడ్పీ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ

image

జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ జడ్పీటీసీ సభ్యురాలు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ‘మీ పాలన మీ తాతగారిని గుర్తుచేస్తోంది’ అని మంత్రిని ఉద్దేశించి ఆమె అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ప్రజా ప్రతినిధిని ఆయన గౌరవించే వారని గుర్తు చేశారు. మంత్రి స్పందిస్తూ ‘తాతగారి బాటలో మీ అందరి సహకారంతో పనిచేస్తాం’ అని మాట ఇస్తున్నానన్నారు.

Similar News

News March 11, 2025

విజయనగరం జిల్లాలో మైనార్టీలకు గుడ్ న్యూస్

image

ముస్లింలు, క్రైస్త‌వులు, బౌద్దులు, సిక్కులు, జైనులు, పార్శీకుల రుణాల‌ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని జిల్లా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ ఆర్‌.ఎస్‌.జాన్ సోమవారం కోరారు. వివిధ బ్యాంకుల నుంచి సబ్సిడీతో కూడిన రుణాల‌ను అందించ‌నున్న‌ట్లు తెలిపారు. వ‌య‌సు 21- 55 లోపు ఉండాల‌న్నారు. తెల్ల రేష‌న్ కార్డు, ఆధార్ కార్డుతో ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News March 11, 2025

VZM: ఆదర్శ దివ్యాంగ జంటలకు అభినందన

image

ఆద‌ర్శ వివాహం చేసుకున్న దివ్యాంగ జంట‌ల‌ను ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ శ్రీనివాస‌మూర్తి సోమవారం ఆశీర్వ‌దించారు. విజ‌య‌దుర్గా దివ్యాంగుల సంక్షేమ సంఘం, హెల్పింగ్ హేండ్స్ హిజ్రాస్ సంస్థ సమక్షంలో రెండు విభిన్న ప్ర‌తిభావంతుల జంట‌ల‌కు వివాహం చేశాయి. జిల్లాకు చెందిన నారాయ‌ణ‌, శ్రీ‌స‌త్య‌ అలాగే సత్య ఆచారి, విజ‌య‌ల‌క్ష్మి ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఈ రెండు జంట‌ల‌ను శ్రీనివాస్ మూర్తి అభినందించారు.

News March 10, 2025

పొక్సో కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష: VZM SP

image

గంట్యాడ మండలంలోని కొటారుబిల్లికి చెందిన రవి ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌లో గత ఏడాది అక్టోబర్ 27 ఫోక్సో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టామన్నారు. నేరం రుజువు కావడంతో 134 రోజుల్లోనే శిక్ష ఖరారైందన్నారు. నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష రూ.10వేల జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. 

error: Content is protected !!