News March 15, 2025

VZM: జిల్లాకు ప్రత్యేకాధికారి రాక

image

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై పర్యవేక్షణ చేసే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నియమించిన ప్రత్యేక అధికారి అహ్మద్ బాబు శనివారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు జిల్లాకు చేరుకొని స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. 10.30 గంటలకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారని చెప్పారు.

Similar News

News March 17, 2025

నాలుగు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు: DEO

image

జిల్లాలో రేపటి నుంచి ప్రారంభ‌మ‌య్యే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లకు ఏర్పాట్లు చేసిన‌ట్లు DEO మాణిక్యం నాయుడు, రాష్ట్ర ప‌రిశీల‌కుడిగా జిల్లాకు వచ్చిన విద్యాశాఖ అధికారి టెహ‌రా సుల్తానా చెప్పారు. ఆదివారం విజయనగరం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు కేంద్రాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా సీసీ టీవి కెమెరాల‌ను అమ‌ర్చామన్నారు. 9 ఫ్ల‌యింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామ‌న్నారు.

News March 16, 2025

VZM: అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే అటాచ్ చేస్తాం: SP

image

గంజాయి ద్వారా అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే అటాచ్ చేస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. గంజాయి విక్రయాలు, అక్రమ రవాణా చేపట్టినా, వినియోగించినా నేరమేనన్నారు. గత సంవత్సరంలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై 62 కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో 1656.990 లక్షల కిలోల గంజాయి, 70 గ్రాముల నల్లమందు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 25 కేసులు నమోదు చేశామన్నారు.

News March 16, 2025

గంజాయి అక్రమ రవాణాపై నిఘా: ఎస్పీ

image

గంజాయి అక్రమ రవాణాపై దృష్టి సారించినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తే నేరంగా పరిగణించి చట్ట పరిధిలో కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోందన్నారు. విద్యార్థులు, యువత, ప్రజలకు మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తామన్నారు.

error: Content is protected !!