News March 30, 2025

VZM: జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. శనివారం గుర్లలో 42.1°C నమోదైంది. ఇవాళ కూడా జిల్లా వ్యాప్తంగా వడగాలులు, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండనున్నాయి. బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, చీపురుపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గంట్యాడ, గరివిడి, గుర్ల, జామి, కొత్తవలస, ఎల్.కోట, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, రాజాం, రామభద్రపురం, రేగిడి, ఎస్.కోట, తెర్లాం, వంగర మండలాల్లో దాదాపు 40°C నమోదవుతుందని APSDMA హెచ్చరించింది.

Similar News

News November 8, 2025

వసతి గృహంలో విద్యార్థులతో కలిసి ఎంపీ కలిశెట్టి రాత్రి బస

image

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన పుట్టిన రోజును శుక్రవారం పూసపాటిరేగ మండలం కొప్పెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి సాదాసీదాగా జరుపుకున్నారు. విద్యార్థులకు స్వయంగా వడ్డించి వారితో కలిసి భోజనం చేసిన ఎంపీ.. రాత్రి కూడా అక్కడే విద్యార్థుల మధ్య బస చేశారు. తన జన్మదిన వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం సంతృప్తినిచ్చిందని ఎంపీ పేర్కొన్నారు.

News November 8, 2025

జాతీయస్థాయి పోటీలకు కొత్తవలస విద్యార్థిని

image

డిసెంబర్‌లో జరగనున్న జాతీయస్థాయి అండర్-19 మహిళా క్రికెట్ పోటీలకు కొత్తవలస ZPHS విద్యార్థిని పుష్పిత గౌడ కుమార్ ఎంపికైనట్లు HM ఈశ్వరరావు తెలిపారు. గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విజయనగరం జిల్లా జట్టు తరుఫున ఆడి 3వ స్థానం సాధించింది. దీంతో ఏపీ రాష్ట్ర మహిళా క్రికెట్ టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చినట్లు పీడీ బంగారు పాప తెలిపారు.

News November 8, 2025

మండలానికి 500 ఎకరాల్లో ఉద్యాన పంటలు: VZM కలెక్టర్

image

కూరగాయల పెంపకంపై దృష్టి పెట్టాలని, రైతులకు సుస్థిర లాభం వచ్చేలా కృషి చేయాలని కలెక్టర్ ఎస్‌.రాంసుందర్ రెడ్డి సూచించారు. ఉద్యాన, పశు సంవర్ధక, అటవీ, ఏపీఎంఐపీ శాఖలపై శుక్రవారం సమీక్ష జరిపారు. మండలానికి కనీసం 500 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి జరగాలన్నారు. స్థానిక మార్కెట్ డిమాండ్‌ మేరకు కూరగాయలు, పూల తోటలు, అరటి, బొప్పాయి, పుట్టగొడుగు సాగు పెంచాలని సూచించారు.