News April 5, 2025

VZM: జిల్లాలో మూడు అన్న కాంటీన్లకు రాష్ట్ర స్థాయి ర్యాంక్‌లు

image

రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల నిర్వ‌హించిన క్యూఆర్ కోడ్ ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌లో జిల్లాకు చెందిన మూడు అన్న క్యాంటీన్లు మెరుగైన ర్యాంకుల‌ను సాధించాయి. బొబ్బిలి ఆర్అండ్‌బీ ఆఫీసు స‌మీపంలోని అన్న క్యాంటీన్‌కు రాష్ట్ర‌ స్థాయిలో ఐదో స్థానం, విజ‌య‌న‌గ‌రం ప్ర‌కాశం పార్కులోని క్యాంటీన్‌కు ఏడో స్థానం, ఘోషా ఆసుప‌త్రిలోని అన్న క్యాంటిన్‌కు ప‌దో స్థానం ద‌క్కాయని కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం తెలిపారు.

Similar News

News November 7, 2025

VZM: సబ్సిడీ కింద సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు

image

సఫాయి కర్మచారి యువతకు NSKFDC పథకం కింద సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీనింగ్‌ వాహనాలు సబ్సిడీపై మంజూరు చేయనున్నట్లు SC కార్పొరేషన్‌ ED వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాకు కేటాయించిన మూడు వాహనాలకు కొత్త లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. ఐదుగురు సఫాయి కర్మచారులు కలిసి గ్రూపుగా దరఖాస్తు చేసుకోవాలని, వారిలో ఒకరికి హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలని సూచించారు. జిల్లా కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలన్నారు.

News November 7, 2025

వెయ్యిమందికి తక్కువ కాకుండా ఉపాధి ప‌ని: VZM కలెక్టర్

image

ప్రతి మండలంలో కనీసం వెయ్యిమందికి తక్కువ కాకుండా ఉపాధి పనులు కల్పించాల‌ని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. MNREGS పథకం అమలుపై శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. తక్కువ ప్రగతి ఉన్న మండలాలపై దృష్టి సారించాలని సూచించారు. వచ్చే వారం నాటికి 20% పనులు ప్రారంభించాలని, సగటు వేతనాన్ని పెరిగేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు.పనికల్పనలో వెనుకబడిన మండలాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

News November 7, 2025

‘కూటమిగా పోరాడదాం.. మెంటాడను సాధిద్దాం’

image

మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో కొనసాగించేకు ఉమ్మడిగా పోరాడాలని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన నాయకులు సమావేశం అయ్యారు. మెంటాడ మండలం పార్వతీపురం జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. త్వరలో మండల ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులకు తెలియజేస్తామన్నారు.