News August 27, 2024

VZM: జిల్లాలో 39,972 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా

image

జిల్లాలో ఉచిత ఇసుక సరఫరా విధానం ప్రారంభించిన జులై 8 నుంచి 26వ తేదీ వరకు మూడు ఇసుక డిపోల ద్వారా 39,972 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేసినట్లు గనుల శాఖ ఉప సంచాలకులు సిహెచ్. సూర్యచంద్ర రావు తెలిపారు. సోమవారం ఒక్క రోజులో 30 బుకింగ్‌లు ద్వారా 449 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేశారని పేర్కొన్నారు. నేటికీ జిల్లాలో 47,107 టన్నులు అందుబాటులో ఉందని వెల్లడించారు.

Similar News

News September 11, 2024

విజయనగరం జిల్లాలో పశువుల అక్రమ రవాణా..!

image

కొత్తవలస మండల కేంద్రంలోని సంతపాలెంలో పశువులను అక్రమంగా నిర్బంధించిన గోడౌన్‌పై సీఐ షణ్ముఖరావు మంగళవారం తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా అక్రమంగా తరలించేందుకు ఉంచిన 108 పశువులను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని, పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న గొటివాడ ఎర్రిబాబు, గొటివాడ నవీన్, ఐ.దేవుళ్లను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.

News September 11, 2024

పెదమానాపురం హైవేపై లారీ బోల్తా

image

దత్తిరాజేరు మండలం పెదమానాపురం హైవేపై ఈరోజు తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్‌గడ్ నుంచి కంటకాపల్లి వైపు బొగ్గుతో వెళ్తున్న లారీ పెదమానాపురం ఆర్‌సీ‌ఎం చర్చి దగ్గర బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ రోడ్డుపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. నివారణ చర్యలు చేపట్టాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

News September 11, 2024

కౌలు రైతుల రుణాల‌ను ముమ్మ‌రం చేయాలి: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో కౌలు రైతుల‌కు రుణాలు అందించే కార్య‌క్ర‌మాన్ని బ్యాంకులు మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ బ్యాంక‌ర్ల‌ను కోరారు. కౌలు రైతుల‌కు రుణాలు అందించే కార్య‌క్ర‌మంపై డీసీసీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ స‌మీక్షించారు. 2,333 మందికి కౌలు రుణాల కోసం బ్యాంకుల‌కు ద‌ర‌ఖాస్తులు పంపించామ‌ని వ్య‌వ‌సాయ శాఖ జిల్లా అధికారి రామారావు వివ‌రించారు.