News October 26, 2024
VZM: జిల్లా అంతటా ఇసుకకు ఒకే తవ్వకపు ధర

ఇసుక తవ్వకపు ధర జిల్లా అంతటా ఒకే విధంగా ఉండేలా కమిటీ నిర్ణయం తీసుకుంది. విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ అధ్యక్షతన ఇసుక సరఫరా జిల్లా స్థాయి సమావేశం శనివారం జరిగింది. స్టాక్ పాయింట్ వద్ద ఇసుక తవ్వకపు ధర టన్నుకు రూ.425గా, నేరుగా రీచ్ వద్ద తీసుకునే వారికి రూ.150గా ధరను నిర్ణయించారు. దీనికి ఎటువంటి సీనరేజి లేదని, రవాణా ఛార్జీలను మాత్రమే లబ్ధిదారులు చెల్లించాలని కలెక్టర్ తెలిపారు.
Similar News
News October 28, 2025
VZM: ‘24 గంటలు విధుల్లో ఉండాలి’

మొంథా తుఫానును దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన 71 పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులను కల్పించాలని జిల్లా తుఫాను ప్రత్యేకాధికారి రవి సుభాష్ పట్టంశెట్టి ఆదేశించారు. కాల్ సెంటర్లతో పాటు సచివాలయాలు, పునరావాస కేంద్రాల్లో కూడా ప్రభుత్వ సిబ్బంది షిఫ్టులవారీగా 24 గంటలు విధులను నిర్వహించాలని స్పష్టం చేశారు. రేషన్ సరకులు, తాగునీరు, మందులు, ఇతర వస్తువులును సిద్ధంగా ఉంచాలన్నారు.
News October 28, 2025
గుర్ల కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్.. ఐదుగురికి అస్వస్థత

గుర్ల KGBVలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో డార్మిటరీలో పరుపులు తగలబడి పొగ వ్యాపించింది. మంటలు చెలరేగడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలు చెందారు. అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని అంతా బయటకి వచ్చారు. ఈ ఘటనలో పొగ పీల్చిన ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నెల్లిమర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే చికిత్స అందడంతో ఆరోగ్యం మెరుగుపడిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు.
News October 28, 2025
తుఫాన్ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం: VZM SP

మొంథా తుఫాన్ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని ఎస్పీ ఏఆర్.దామోదర్ మంగళవారం తెలిపారు. భారీ వర్షాల కారణంగా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారని పేర్కొన్నారు. కాకినాడ, మచిలీపట్నం మధ్యలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటేటప్పుడు ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని, ప్రజలకు ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


