News May 21, 2024

VZM: జిల్లా ప్రజలకు ఎస్పీ కీలక సూచనలు

image

ఇటీవల ఫెడెక్స్ కొరియర్ పేరుతో వచ్చే కాల్స్‌తో ప్రజలు సైబర్ మోసాలకు గురవుతున్నారని, ఇటువంటి నకిలీ కాల్స్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎం.దీపిక సూచించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. కొరియర్ సర్వీసులతో వచ్చే నకిలీ కాల్స్‌ను నమ్మి, సైబర్ మోసాల బారిన పడొద్దని కోరారు. ఈ తరహా సైబర్ మోసగాళ్ల కాల్స్ భయపడాల్సిన పని లేదని, ఇటువంటి కాల్స్ ప్రజలెవరూ స్పందించకూడదన్నారు.

Similar News

News April 23, 2025

ఈనెల 30న పాలిసెట్ పరీక్ష: DRO

image

ఈ నెల 30న పాలిసెట్ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని DRO శ్రీనివాస మూర్తి తెలిపారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో పరీక్ష నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 8,083 మంది అభ్యర్థులు 23 కేంద్రాల్లో హాజరు కానున్నారని తెలిపారు. విజయనగరంలో 9 కేంద్రాలు, బొబ్బిలిలో 6 కేంద్రాలు, గజపతినగరంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

News April 23, 2025

VZM: నేడే పది ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో..!

image

బుధవారం ఉ.10 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. విజయనగరం జిల్లాలో 2,359 పాఠశాలల నుంచి 23,765 మంది పరీక్ష రాయగా వారిలో 12,504 మంది బాలురు, 11,711 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 22,930 మంది కాగా ప్రైవేట్‌గా 835 మంది పరీక్ష రాశారు. మొత్తం 119 సెంటర్లలో పరీక్షలను నిర్వహించారు. ఒక్క క్లిక్‌తో వే2న్యూస్‌లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it

News April 22, 2025

సివిల్స్‌లో 830వ ర్యాంక్ సాధించిన రాజాం యువకుడు

image

రాజాం మండలం సారధికి చెందిన వావిలపల్లి భార్గవ మంగళవారం విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 830వ ర్యాంక్ సాధించారు. నాలుగుసార్లు UPSC ఇంటర్వ్యూల వరకు వెళ్లి విఫలమైయారు. 5వ ప్రయత్నంలో సివిల్స్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖలో పిడుగురాళ్ల సర్కిల్ కమిషనర్‌గా భార్గవ పనిచేస్తున్నారు. ఇయన తండ్రి విష్ణు ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

error: Content is protected !!