News October 17, 2024

VZM: ‘జిల్లా వ్యాప్తంగా శానిటేష‌న్ స్పెష‌ల్ డ్రైవ్‌’

image

జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ప్ర‌త్యేక శానిటేష‌న్ డ్రైవ్‌ నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బి.ఆర్. అంబేద్కర్ ఆదేశించారు. అధికారులతో క‌లెక్ట‌ర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా పారిశుద్ధ్య సమస్య రాకూడదని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇంటింటి స‌ర్వే నిర్వ‌హించి ప‌రిస్థితిని తెలుసుకోవాల‌ని సూచించారు. గుర్ల డయేరియా ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు.

Similar News

News October 17, 2024

VZM: 29 నుంచి వైద్యసేవ క్షేత్ర సిబ్బంది సమ్మె

image

డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సిబ్బంది సమస్యలు 17 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఏపీ వైద్యమిత్ర ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జె.ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ఉన్నతాధికారులకు ఇప్పటికే వినతిపత్రం అందజేశామని, ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళుతున్నట్లు తెలిపారు.

News October 16, 2024

బొత్స ఫొటో వైరల్.. ఖండించిన అనుచరులు

image

శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జనసేనలో చేరుతారంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీన్ని ఆయన అనుచరవర్గం తీవ్రంగా ఖండించింది. గడిచిన 32 ఏళ్ల నుంచి DCCB బ్యాంకు నుంచి బొత్స సిరిమానోత్సవాన్ని తిలకించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపింది. ఈ నేపథ్యంలో DCCB కార్యాలయంలో కూర్చున్న ఫొటో ఆధారంగా అసత్య ప్రచారం చేయడం సరికాదంటూ మండిపడింది.

News October 16, 2024

చంపావతిలో కళేబరాలు కొట్టుకురాలేదు: కలెక్టర్

image

చంపావతి నదిలో కళేబరాలు కొట్టుకురావడం వల్లనే నీరు కలుషితమై గుర్లలో అతిసారం ప్రబలిందనే వార్త అపోహ మాత్రమేనని కలెక్టర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఆ నీటిని పరీక్షలు జరపగా నెగటివ్ వచ్చిందని, కలుషితం కాలేదని తెలిపారు. వదంతులను ప్రజలు నమ్మవద్దని, ప్రస్తుతం పరిస్థితి అంతా అదుపులోనే ఉందని వెల్లడించారు. చంపావతి నది నీరు 26 గ్రామాలకు సరఫరా అవుతుందని, ఏ గ్రామం లో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని పేర్కొన్నారు.